ఎన్టీఆర్ ‘దేవర ‘ సినిమా లో మరో స్పెషల్ రోల్ ?

ఎన్టీఆర్ ‘దేవర ' సినిమా లో మరో స్పెషల్ రోల్ ?
Cinema news

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేస్తున్నాడు. అయితే, ఈ సినిమాకి సంబంధించి సీక్వెల్ కూడా రాబోతుంది అని కొరటాల ఎనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ సినిమా పై అనేక ఇంట్రెస్టింగ్ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా మరో గాసిప్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఒక గెస్ట్ రోల్ ఉందని, ఇది కీలక పాత్ర అని, ఈ పాత్ర చాలా వైల్డ్ గా ఉంటుందని.. పైగా సీక్వెల్ డ్రైవ్ మొత్తం ఈ క్యారెక్టర్ చుట్టే తిరుగుతుందని.. అందుకే ఈ పాత్రని కొరటాల శివ చాలా బలంగా డిజైన్ చేశాడని టాక్. పైగా ఈ పాత్రలో ఒక బాలీవుడ్ స్టార్ హీరో కనిపిస్తాడట.

ఎన్టీఆర్ ‘దేవర ' సినిమా లో మరో స్పెషల్ రోల్ ?
NTR

కేవలం పాన్ ఇండియా మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని ఈ పాత్రను డిజైన్ చేసినట్లు టాక్. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ , ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మాత్రం ఫుల్ కిక్ ఇస్తుంది . దేవర మూవీ ను దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఎంతైనా కొరటాల ఈ దేవర కథ కోసం చాలా నెలలు కసరత్తులు చేసారు . మరి కథలో కొరటాల శివ ఎలాంటి ఎలిమెంట్స్ రాశాడో చూడాలి మరి . ఇక ఎన్టీఆర్ – కొరటాల శివ కలయికలో ఈ మూవీ వస్తుండే సరికి, ఈ సినిమా పై భారీ అంచనాలు కూడా ఉన్నాయి. పైగా ఈ మూవీ ను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తుంది .