కన్నప్ప మూవీలో నటించనున్న మరో స్టార్ హీరోయిన్..!

Another star heroine to act in Kannappa's movie..!
Another star heroine to act in Kannappa's movie..!

హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ క‌న్న‌ప్ప‌. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ కి మోహన్ బాబు నిర్మాతగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. భారీ బడ్జెట్ తో, స్టార్ కాస్ట్ తో కన్నప్ప మూవీ తెర‌కెక్కుతోంది. ఈ మూవీ లో మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, అక్షయ్ కుమార్, ప్రభాస్, బ్రహ్మానందం, నయనతార, మధుబాల వంటి స్టార్ న‌టీన‌టులు భాగ‌స్వామ్యం అయ్యారు. తాజాగా మ‌రో స్టార్ హీరోయిన్ సైతం ఈ మూవీ లో నటిస్తుంది .

Another star heroine to act in Kannappa's movie..!

Another star heroine to act in Kannappa’s movie..!

ఆమె ఎవరో కాదు అందాల చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్‌. ఈ విష‌యాన్ని చిత్ర బృందం సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేసింది. ఒక మంచి పాత్ర‌లో ఆమె న‌టించ‌నున్న‌ట్లు తెలిపింది. ఇప్పటికే కన్నప్ప మూవీ న్యూజిలాండ్ లో రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేకున్నది . ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. కాగా.. మే 14 నుంచి మే 25 వరకు ఫ్రాన్స్ లో జరగనున్న కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో కన్నప్ప మూవీ బృందం పాల్గొననుంది. మే 20న సాయంత్రం 6 గంటలకు కాన్స్ ఫిలిం ఫెస్టివల్ వేదికలో కన్నప్ప టీజర్ రిలీజ్ చేయబోతున్నట్టు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.