అక్కినేని కోడలు సమంత కూడా ఏఎన్నార్‌ను గుర్తుచేసుకున్నారు. తన ట్విటర్ ప్రొఫైల్ పిక్చర్లో ఎ.ఎన్.ఆర్ నటించిన సినిమల్లోని పాత్రలన్నీ కలిపిన ఫొటోలన్నీ కలిపి ఉన్న ఇమేజ్ను పెట్టుకున్నారు. ఏఎన్నార్ మనవడు, నటుడు సుశాంత్ కూడా తన తాతగారితో ఉన్న అనుబంధాలను ట్విటర్లో పంచుకున్నారు
చిన్నప్పుడు తన తాతగారితో కలిసి దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ‘హ్యాపీ బర్త్‌డే తాతా.. నేను మీ జీవితంలో కొంతకాలమే భాగమై ఉన్నప్పటికీ ఎంతో గొప్పగా ఫీలవుతున్నాను. మరింత కష్టపడేలా మీరు మాలో స్ఫూర్తి నింపారు. మీరు మా హృదయాల్లో చిరకాలం నిలిచిపోతారు’ అని పేర్కొన్నారు.
1949 ఫిబ్రవరి 18న నాగేశ్వరరావు అన్నపూర్ణను వివాహం చేసుకున్నారు. తనను పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకొన్నందుకు ఆమె కుటుంబానికి ఎప్పటికీ రుణ పడి ఉంటానని, ఆమెపై ప్రేమతోనే తన వ్యాపార సంస్థలన్నింటికీ అన్నపూర్ణ అని నామకరణం చేశానని నాగేశ్వరరావు చాలా సందర్భాల్లో చెప్పారు. 2014 జనవరి 22న ఏఎన్నార్ చివరి శ్వాస విడిచారు.