అనుష్కతో జపాన్ చేక్కేస్తున్న ప్రభాస్…అందుకేనా ?

Anushka And Prabhas Going Japan

అనుష్క, ప్రభాస్ లు కలిసి జపాన్ కు వెళ్ళడం మళ్ళీ పలు చర్చలకు తావిస్తోంది. నిజానికి వీరిద్దరూ ఏమి చేసినా వార్తల్లో ప్రముఖంగా నిలుస్తున్నారు. వారిద్దరూ ప్రేమించుకుంటున్నారని, త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నారని పదే పదే రూమర్లు రావడమే దానికి కారణం. దీంతో ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఈ ప్రత్యేక ప్రయాణం వెనుక రహస్యం ఏమిటనే చర్చ హాట్ టాపిక్‌ గా మారింది. వీరిద్దరి గురించి వస్తున్న పెళ్లి వార్తలపై కరణ్ జోహార్ నిర్వహిస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ రియాల్టీ షోలో స్పందించారు. అవి రూమర్లేనని, అందులో ఎలాంటి వాస్తవం లేదని వివరణ ఇచ్చారు. అలాగే మరోపక్క ప్రభాస్ కుటుంబ సభ్యులతో పాటు అనుష్క ఫ్యామిలీ కూడా ఇప్పటికే ఈ వార్తలను ఖండించారు.

దీంతో ప్రభాస్, అనుష్క ఇద్దరూ కలిసి జపాన్ వెళ్లడానికి గల కారణాలేంటని ఆరా తీస్తే ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. బాహుబలి సినిమాను జపాన్‌లో విడుదల చేయడం వల్ల ప్రభాస్‌కు అక్కడ బాగా క్రేజ్ వచ్చిందట. ఈ క్రమంలో ప్రభాస్ నటించిన పలు సినిమాలను జపాన్‌ లోకి డబ్బింగ్ చేసి విడుదల చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు అక్కడి నిర్మాతలు. ప్రభాస్, అనుష్క కలిసి నటించిన ‘మిర్చి’ సినిమా తెలుగులో మంచి విజయం సాధించింది. తాజాగా దీన్ని జపాన్‌లో విడుదల చేస్తున్నారు. మార్చి 2న విడుదలవనున్న ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి ప్రభాస్, అనుష్క అక్కడికి వెళ్తున్నారట. అదండీ సంగతి అందుకే ఇద్దరూ కలిసి ప్రయాణం చేస్తున్నారు మరి !