Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గత కొంత కాలంగా తెలుగు సినిమా పరిశ్రమలో అనుష్క మరియు ప్రభాస్‌ల మద్య ప్రేమ వ్యవహారం గురించి భారీ స్థాయిలో ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే. అనుష్క, ప్రభాస్‌లు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ఆమద్య మీడియాలో జోరుగా వార్తలు వచ్చాయి. ప్రముఖ జాతీయ దిన పత్రికలో కూడా వార్తలు రావడంతో నిజంగానే ప్రభాస్, అనుష్కలు వివాహం చేసుకుంటారేమో అని ఫ్యాన్స్ అంతా భావించారు. కాని ఆ వార్తలు నిజం కాదని పదే పదే చెబుతూ ఉన్నా కూడా వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రభాస్ ఇటీవలే అనుష్కతో ప్రేమ విషయమై క్లారిటీ ఇచ్చాడు.
తాజాగా అనుష్క ‘భాగమతి’ అనే చిత్రాన్ని చేయడం జరిగింది. ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా మాట్లాడుతూ ప్రభాస్‌తో ప్రేమ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది. ప్రభాస్‌తో తనకు స్నేహం తప్ప మరేం లేదని, మళ్లీ మళ్లీ ఇదే ప్రశ్న ఎందుకు నా ముందుకు తీసుకు వస్తున్నారు అంటూ అసహనం వ్యక్తం చేసింది. తాను పలు సార్లు ఈ విషయమై వివరణ ఇచ్చినా కూడా ఎందుకు మళ్లీ అవే పుకార్లు పుట్టిస్తున్నారు అంటూ అనుష్క ఆగ్రహం వ్యక్తం చేసింది.
అనుష్క చేసిన ప్రకటనతోనైనా ప్రేమ, పెళ్లి వార్తలకు ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి. అభిమానులు మాత్రం ప్రభాస్, అనుష్కలు పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నారు. తాజాగా ప్రభాస్ పెద్ద నాన్న కృష్ణం రాజు మాట్లాడుతూ ఇదే సంవత్సరంలోనే పెళ్లి చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. సంబంధాలు చూస్తున్నామని, త్వరలోనే ప్రభాస్‌కు అమ్మాయిని ఫిక్స్ చేస్తామని చెప్పుకొచ్చాడు. దాంతో అనుష్క, ప్రభాస్‌ల వివాహం లేదని తేలిపోయింది.