అబ్బే… అటు వెళ్లే ఆలోచనే లేదు

VV Vinayak Responds on his Political Entry

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
సినిమా పరిశ్రమ నుండి రాజకీయాల్లోకి ఇటీవల పలువురు స్టార్స్‌ వెళ్తున్న విషయం తెల్సిందే. అదే దారిలో యాక్షన్‌ చిత్రాల దర్శకుడు వివి వినాయక్‌ రాజకీయాల్లోకి వెళ్లబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అప్పట్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడే వినాయక్‌ రాజకీయ అరంగేట్రం చేస్తాడంటూ ప్రచారం జరిగింది. ఈమద్య జనసేన పార్టీ తరపున లేదా కాంగ్రెస్‌ తరపున వినాయక్‌ అసెంబ్లీ బరిలో దిగబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా తన రాజకీయ ఎంట్రీపై వస్తున్న వార్తలపై దర్శకుడు వివి వినాయక్‌ స్పందిస్తూ పుకార్లను కొట్టి పారేశాడు.

తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని, తనకు అలాంటి ఆలోచనే లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం తన దృష్టి అంతా కూడా సినిమాలపైనే ఉందని, రాజకీయాల్లోకి వెళ్లి పదవులు పొందే ఆలోచన తనకు ఎప్పుడూ లేదంటూ మీడియాలో వస్తున్న వార్తలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టాడు. అయితే వినాయక్‌ కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందనే వార్త కూడా జోరుగా ప్రచారంలో ఉంది. అయితే ఆ విషయమై మాత్రం వినాయక్‌ ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఇంటిలిజెంట్‌ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా వినాయక్‌ మీడియాతో మాట్లాడుతూ తన రాజకీయ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు.