‘ఎన్టీఆర్‌’ చిత్రం కోసం వినాయక్‌…!

VV Vinayak To Act In NTR Biopic

ఎన్టీ రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘ఎన్టీఆర్‌’. బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు నటిస్తున్న విషయం తెల్సిందే. ఎన్టీఆర్‌ గా బాలకృష్ణ నటిస్తుండగా, బసవతారకం పాత్రలో విద్యాబాలన్‌ నటిస్తోంది. ఇక చంద్రబాబు నాయుడు పాత్రను రానా, హరికృష్ణ పాత్రను కళ్యాణ్‌ రామ్‌లు పోషిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో పలువురు ప్రముఖ నటీనటులు మరియు దర్శకులు కూడా కనిపించబోతున్నారు. ఇప్పటికే విఠలాచార్య పాత్ర కోసం ఎన్‌ శంకర్‌తో చిత్రీకరణ జరిపిన దర్శకుడు క్రిష్‌ తాజాగా ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు సీన్స్‌ను చిత్రీకరించేందుకు సిద్దం అవుతున్నాడు.

ntr-bio-pic

ఎన్టీఆర్‌, దాసరిల కాంబినేషన్‌లో ఎన్నో అద్బుతమైన సినిమాలు వచ్చాయి. ఎన్టీఆర్‌కు అంత క్రేజ్‌ తెచ్చి పెట్టిన దాసరి చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఆ కారణంగానే ఎన్టీఆర్‌ బయోపిక్‌లో దాసరిని ప్రముఖంగా చూపించేందుకు క్రిష్‌ ప్లాన్‌ చేస్తున్నాడు. క్రిష్‌ ఈ చిత్రంలో దాసరి పాత్రను యాక్షన్‌ చిత్రాల దర్శకుడు వివి వినాయక్‌తో చేయించేందుకు సిద్దం అయ్యాడు. వినాయక్‌ రెండు లేదా మూడు రోజుల పాటు ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. వినాయక్‌ తో పాటు ఇంకా ఈ చిత్రంలో ఇంకా పలువురు దర్శకులు కూడా కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.

ntr-bio-pic

రాఘవేంద్ర రావు పాత్రలో ఒక ప్రముఖ దర్శకుడిని ఈ చిత్రంలో చూపించేందుకు ఏర్పాట్లు చేశాడు. మొత్తానికి తారా తోరణంతో ఎన్టీఆర్‌ చిత్రం మెరిసి పోవడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అంటూన్నారు. పెద్ద ఎత్తున తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు పార్ట్‌లుగా రాబోతుంది. వచ్చే జనవరిలో సంక్రాంతి కానుకగా మొదటిది, రిపబ్లిక్‌ డే సందర్బంగా రెండవ పార్ట్‌ను విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.

vv-vinayak-balayya