Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ మరియు అనుష్కలకు బాలీవుడ్‌లో మంచి క్రేజ్ మొదలైంది. వీరిద్దరు కూడా బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సఫలం అయిన కారణంగా వీరిద్దరికి బాలీవుడ్‌లో మంచి ఆఫర్లు వస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ ప్రముఖ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ వీరికి భారీ ఆఫర్ చేశాడు. మొదట ప్రభాస్‌తో రెండు సినిమాలను బ్యాక్ టు బ్యాక్ బాలీవుడ్‌లో చేయాలని భావించిన కరణ్ జోహార్ అందుకోసం భారీ పారితోషికాన్ని ప్రభాస్‌కు ఆఫర్ చేయడం జరిగింది. కాని ప్రభాస్ మాత్రం ప్రస్తుతం తన దృష్టి అంతా కూడా టాలీవుడ్ పైనే అంటూ తప్పుకునే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం చేస్తున్న సినిమా తర్వాత బాలీవుడ్ గురించి ఆలోచిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.
తాజాగా అనుష్క కూడా బాలీవుడ్ నుండి వచ్చిన మంచి ఆఫర్‌ను కాదనుకున్నట్లుగా తెలుస్తోంది. అనుష్కకు కూడా కరణ్ జోహార్ ఒక పెద్ద ప్రాజెక్ట్‌లో అనుష్కకు అవకాశం ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. దాదాపు 5 కోట్ల పారితోషికాన్ని కూడా ఆఫర్ చేయడం జరిగింది. కాని అనుష్క మాత్రం ప్రస్తుతం తనకు బాలీవుడ్‌పై ఆసక్తి లేదు అంటూ తేల్చి పారేసింది. ప్రస్తుతం తెలుగులో చేస్తోన్న ‘భాగమతి’ విడుదలయ్యే వరకు తాను మరే ప్రాజెక్ట్‌ను టేకోవర్ చేయను అంటూ చెప్పుకొచ్చింది. తమిళంలో కూడా అనుష్కకు అవకాశాలు దక్కాయి. కాని వాటికి కూడా నో చెప్పింది.
అనుష్క, ప్రభాస్‌లు ప్రేమలో ఉన్నట్లుగా గత కొంత కాలంగా సినీ వర్గాల్లో మరియు మీడియా వర్గాల్లో తెగ ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారంలో నిజం ఎంతుందో తెలియదు కాని, ఇద్దరు అభిప్రాయాలు మాత్రం ఒక్కటే ఉన్నాయి. బాలీవుడ్‌కు వెళ్లేందుకు ప్రభాస్‌కు ఆసక్తి లేదు. అలాగే అనుష్క కూడా బాలీవుడ్‌పై అంతగా ఆసక్తిని కనబర్చడం లేదు. వీరిద్దరు అనుకుని బాలీవుడ్‌కు నో చెబుతున్నారా అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.