నారాయణను అటు నుంచి నరుక్కొచ్చిన చైతన్య.

nara lokesh settled narayana sri chaitanya college issue

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మెరిట్ విద్యార్థుల కొనుగోలు వ్యవహారంలో నారాయణ, చైతన్య మధ్య ఎంత పెద్ద చిచ్చు రగిల్చిందో తెలిసిందే. ఈ వ్యవహారంలో నారాయణ దే పై చేయి అయ్యింది. సీఎం చంద్రబాబుకి సన్నిహితుడుగా పేరు పడ్డ నారాయణ క్యాబినెట్ లో వున్నారు. నారాయణ వియ్యంకుడు గంటా శ్రీనివాసరావు విద్యాశాఖ నిర్వహిస్తున్నారు. దీంతో ఇద్దరు మంత్రులు, అందులో తమ ప్రత్యర్థి సీఎం సన్నిహితుడు అనే బ్రాండ్ ని ఎదుర్కోవడం చైతన్య కి కష్టం అయ్యింది. అయితే నారాయణ సొంత వూరు నెల్లూరు లో త్వరలో నారాయణ కాలేజీ అక్రమాలకు చెక్ చెపుతామని చైతన్య విద్యాసంస్థల అధినేత బి.వి. రావు కుమార్తె సవాల్ చేశారు. సమరసింహారెడ్డిలో నీ ఇంటికొచ్చా అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ రీతిలో డైలాగ్ చెప్పినా దాన్ని ఎలా సాధించగలరా అని అందరూ ఆసక్తిగా చూసారు. ఓ వైపు రాజకీయాల్లో కాకలు తీరిన నాయకులే నారాయణ వ్యూహాల దెబ్బకి కకావికలం అవుతుంటే చైతన్య చేసిన సవాల్ ఎలా నిలబెట్టుకుంటుందో అనుకున్నారు.

చైతన్య విద్యాసంస్థల యాజమాన్యం అక్కడే నారాయణకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. కార్పొరేట్ కాలేజ్ వార్ కి కుల రంగు పులిమింది. కాపు నేత నారాయణ తమని ఇలా ఇబ్బంది పెడుతుంటే చూస్తూ ఊరుకుంటారా అని కమ్మ కుల పెద్దలను కదిపారంట. వారిని ఒక్కతాటి మీదకు తీసుకొచ్చి నేరుగా లోకేష్ దగ్గరికి రాయబారం నడిపారట. ఓ వైపు పాఠాలు చెప్పిన గురువు, ఇంకో వైపు పార్టీకి అండగా వుండే సొంత కులపు విద్యా వ్యాపారవేత్త ఉండటంతో లోకేష్ వెంటనే అలెర్ట్ అయ్యి గొడవ ముదరకుండా ఓ మీటింగ్ ఏర్పాటు చేశారట. అందులో నారాయణ, చైతన్య ప్రతినిధులు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారట. ఆవేశంతో వూగిపోయారట. అయితే లోకేష్ ఓ రాజీ ఫార్ములాతో ఇద్దరినీ శాంతపరిచి ఎవరి వ్యాపారాలు వారు చేసుకునేలా రెండు వర్గాల్ని ఒప్పించారట. దీంతో వార్ వన్ సైడ్ అనుకున్న నారాయణకు చైతన్య అటు నుంచి నరుక్కురావడం మంట పుట్టిస్తోంది.