మోడీ కూడా వెయిట్ చేస్తారు పాపం…

Rahul gandhi says GST Is Gabbar Singh Tax modi wants to decrease GST

Posted November 13, 2017 at 12:20 
మూడేళ్ళలో ఎంత మార్పు. మూడేళ్ల కిందట ఎక్కడ చూసినా మోడీ జయజయధ్వానాలు. అమెరికాలో సైతం ఆయన ప్రసంగిస్తుంటే మిన్నంటిన చప్పట్లు. మోడీ హోరులో, ఉధృతిలో వందేళ్లకు పైగా రాజకీయ చరిత్ర వున్న కాంగ్రెస్ కుదేలైంది. దేశ రాజకీయాలను శాసించిన గాంధీ నెహ్రు ల వారసుడు రాహుల్ మోడీ ముందు మరగుజ్జు లా కనిపించాడు. కానీ ఆ ఉత్సాహం తో మోడీ అండ్ కో లో ఆత్మవిశ్వాసం బదులు అతి విశ్వాసం పెరిగింది. అందుకే అప్పటిదాకా మిత్రులుగా వున్నవారిని చిన్నచూపు చూసారు. శత్రువు, మిత్రుడు అన్న తేడా లేకుండా దేశంలో ఇంకో పార్టీ మనకూడదు అన్నట్టు రెచ్చిపోయారు. పాలన మీద పట్టు పెరక్కుండానే జనాన్ని ఆకర్షించే దృష్టితో, ఎన్నికల ఆలోచనతో పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజకీయాల్లో హత్యలుండవు ఆత్మహత్యలు తప్ప అన్నట్టు ఇటు సొంత పార్టీలో అటు బయట పార్టీల్లో ఎదురు చూసిన టైం రానే వచ్చింది. మోడీ తీసుకున్న ఆర్ధిక నిర్ణయాలు దేశ భవిష్యత్ ని మాత్రమే కాదు ఆయన రాజకీయ జీవితానికి కూడా స్పీడ్ బ్రేకర్స్ అయ్యాయి.

Rahul-Gandhi-fires-on-Modi

జనాలు జీరో అనుకున్న రాహుల్ గాంధీ ఇప్పుడు హీరోలా కనపడుతున్నారు. జీఎస్టీ ని ఆయన గబ్బర్ సింగ్ టాక్స్ అంటుంటే జనం హర్షధ్వానాలు చేస్తున్నారు. నిజానికి రాహుల్ ని అప్పుడు జీరో చేసినా, ఇప్పుడు హీరో చేసినా అది మోడీ వల్లే సాధ్యం అయ్యింది. ఇక దేశవ్యాప్తంగా రాజకీయ పరిణామాలు కూడా వేగంగా మారిపోతున్నాయి. మోడీ వ్యతిరేకులంతా ఒక్కటి అవుతున్నారు. వీరిలో బీజేపీ మిత్రులు కూడా వున్నారు. బీజేపీ ని మోడీని వేరుగా చూసే దాకా పరిస్థితి వచ్చిందని మోడీకి కూడా అర్ధం అయ్యింది. అందుకే జీఎస్టీ లో తగ్గుదల వంటి నిర్ణయాలు ముందుకు వచ్చాయి. అయినా గతాన్ని గుర్తుంచుకున్న జనాలు ఈ నిర్ణయాలను విశ్వసించడం లేదు. సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇదే విషయం ఇటీవల బీజేపీ దేశవ్యాప్తంగా నిర్వహించిన ఓ రహస్య సర్వే లో వెల్లడి అయ్యిందట. అందుకే ఈ మధ్య దాకా జమిలి ఎన్నికల పేరుతో సార్వత్రిక ఎన్నికలను ముందుకు జరపడానికి చూసిన మోడీ, అమిత్ షా ద్వయం ఇప్పుడు వాటిని సాధ్యమైనంత వెనక్కి అంటే అనుకున్న షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలి అనుకుంటోంది. ప్రజల జ్ఞాపక శక్తి తక్కువని నమ్ముతున్న మోడీ అండ్ కో కాలం గడిచేకొద్దీ పరిస్థితిలో మార్పు వస్తుందేమో అని ఆశపడుతున్నారు. అందుకే పాపం ఇప్పుడు మోడీ కూడా వెయిట్ చేస్తున్నారు. జనం ఆయనకి అపాయింట్ మెంట్ ఎప్పుడు ఇస్తారో? అసలు ఇవ్వరో మరి.

SHARE