అనుష్క సినిమాలకు గుడ్‌బై…!

anuska-pics-images

‘బాహుబలి’ చిత్రం తర్వాత సినిమాల సంఖ్య చాలా వరకు తగ్గించిన అనుష్క గత సంవత్సర కాలంగా అస్సలు సినిమాలే చేయలేదు. ఇటీవలే ఈమె తమిళంలో రెండు సినిమాలు చేసేందుకు కమిట్‌ అయినట్లుగా ప్రచారం జరిగింది. త్వరలోనే ఈమె ఆ చిత్రాల షూటింగ్‌లో పాల్గొనబోతుంది అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో మరో షాకింగ్‌ వార్త ఒకటి ఫిల్మ్‌ సర్కిల్స్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. అనుష్క ప్రస్తుతం కమిట్‌ అయిన సినిమాలు పూర్తి చేసిన తర్వాత సినిమాలకు గుడ్‌ బై చెప్పబోతుందట.

anuska-pics

గత కొన్నాళ్లుగా అనుష్క అధిక బరువుతో సతమతం అవుతుంది. ఆ బరువు కారణంగా ఎన్నో ఆఫర్లు వచ్చి పోయాయి. బరువు తగ్గేందుకు ఎంతగా ప్రయత్నించినా కూడా సాధ్యం కాకపోవడంతో ఇక బరువు తగ్గేందుకు ప్రయత్నించడం మానేసింది. దాంతో అనుష్క సినిమాలకు గుడ్‌ బై చెప్పాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా ప్రచారం జరుగుతుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలో వస్తుందనే నమ్మకంతో అనుష్క అభిమానులు ఉన్నారు. నాగార్జున మూవీ ‘సూపర్‌’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన అనుష్క అరుంధతి చిత్రంతో స్టార్‌ అయ్యింది.

anuska