‘నోటా’పై హై కోర్టులో పిటీషన్‌…!

High Court Petition On Nota Movie

హీరోగా నటించిన ‘నోటా’ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. రేపు ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ సభ్యులు ప్లాన్‌ చేశారు. తెలుగు రాష్ట్రాలు మరియు తమిళనాడులో ఈ చిత్రంను విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాల్లో చిత్ర యూనిట్‌ సభ్యులు బిజీగా ఉన్నారు. ఈ సమయంలోనే చిత్రంపై కాంగ్రెస్‌ నాయకులు కోర్టును ఆశ్రయించారు. కోర్టులో పిటీషన్‌ దాఖు చేయడంతో చిత్ర యూనిట్‌ సభ్యులు టెన్షన్‌ పడుతున్నారు.

nota-movie

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న కారణంగా ఒక పార్టీకి అనుకూలంగా లేదా రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా, ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ఈ చిత్రం ఉండబోతున్న కారణంగా సినిమాను నిలిపేయాలంటూ పిటీషన్‌ దాఖలు చేయడం జరిగింది. ఈ పిటీషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. పిటీషన్‌ విచారణ సందర్బంగా ఎలాంటి సంచలన తీర్పు వస్తుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నోటా చిత్రం విడుదల ఆగిపోయేనా అంటూ ఆందోళన వ్యక్తం అవుతుంది.

nota