అభయ్ రామ్ చేత కత్తి పట్టించిన త్రివిక్రమ్ : ‘అరవింద సమేత’ మేకింగ్…

Aravinda Sametha Making Video

ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం విడుదలకు మరో వారం రోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్రమోషన్ల జోరు పెంచారు. మంగళవారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంటుకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా విడుదల చేసిన ట్రైలర్‌‌ నెం.1లో ట్రెడింగ్ అవుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియో విడుదల చేశారు. ఇందులో ఎన్టీఆర్ తనయుడు అభయ్‌కు కూడా ఉండటం ఫ్యాన్స్‌లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. తాజాగా విడుదలైన మేకింగ్ వీడియోలో ఎన్టీఆర్ తనయుడు అభయ్ రామ్ కనిపించాడు. యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా అభయ్ రామ్ యాక్షన్ చెప్పడం వీడియోలో కనిపిస్తోంది. ఈ సందర్భంగా త్రివిక్రమ్ అభయ్‌ను ఒళ్లో కూర్చోబెట్టుకుని కనిపించారు.
ఆ వీడియో మీద మీరు కూడా ఒక లుక్ వేసెయ్యండి మరి.