స్వీపరే కానీ ఆమె జీతం అక్షరాలా లక్షన్నర…!

Sweeper Salary One Lakh In AP

స్వీపర్‌ కమ్‌ గార్డెనర్‌ ఉద్యోగానికి జీతం ఎంత ఉండచ్చు, మహా అయితే ఒక ఆరు వేలు, ఏడూ వేలు. కానీ విద్యుత్‌ శాఖలో ఈస్టర్న్‌ పవర్‌ డిస్కమ్‌ రాజమహేంద్రవరంలో పని చేసే ఈమె జీతం అక్షరాలా రూ.1,47,722. ఏంటి స్వీపర్‌కు లక్షన్నరజీతమా చెవిలో పూలు పెడుతున్నారా అని అనుకున్నారు అందరూ. కానీ… ఇది అక్షరాలా నిజం! ఆమె మొత్తం జీతం 1,47,722 రూపాయలు! ఆమె మాత్రమే కాదు ఇలా లక్షకు పైబడి జీతం తీసుకునే నాలుగో తరగతి ఉద్యోగులు డిస్కమ్‌లలో చాలామందే ఉన్నారు.
ఎందుకంటే విద్యుత్తు శాఖలో ఉద్యోగం అంటే వరం పొందినట్లే. ఇదంతా సంస్కరణల ఫలం! మొదట్లో విద్యుత్తు శాఖను ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ర్టిసిటీ బోర్డు అని పిలిచేవారు. ఉమ్మడి రాష్ట్ర సీఎంగా చంద్రబాబు విద్యుత్తుశాఖలో సంస్కరణలకు తెరలేపారు. బోర్డు పోయింది. ‘కంపెనీ’లు వచ్చాయి. విద్యుత్తు ఉత్పత్తికి.. జెన్‌కో! సరఫరాకు.. ట్రాన్స్‌కో ఏర్పడ్డాయి. ట్రాన్స్‌కోలో మళ్లీ ప్రాంతాల వారీగా డిస్కమ్‌లను ఏర్పాటు చేశారు. సంస్కరణల నేపథ్యంలో ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్ ఇవ్వడాన్ని ఆపేశారు. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన తలెత్తింది.

money
ఈ నేపథ్యంలో ఉద్యోగుల్లో భరోసా నింపేందుకు అప్పటి ప్రభుత్వం భారీ ఎత్తున వేతనాలు పెంచింది. ఇంక్రిమెంట్లు కూడా అదే స్థాయిలో నిర్ణయించింది. సంస్థలోని ఉద్యోగస్తులందరితో స్వీపర్లు కూడా మంచి జీతం పొందుతున్నారు. వారి జీతం ఐదెంకలు దాటి ఆరంకెల్లోకి చేరింది. రాజమహేంద్రవరం తాడితోట ప్రాంతానికి చెందిన కోల వెంకటరమణమ్మ 1978లో 16వ ఏటనే విద్యుత్తు శాఖలో రోజువారీ ఉద్యోగిగా చేరారు. ఆమె తల్లి కూడా అక్కడే స్వీపర్‌గా పని చేసేవారు. 1981 ఏప్రిల్‌ 1న రమణమ్మ పర్మినెంట్‌ ఎంప్లాయ్‌ అయ్యారు. అప్పటి నుంచి రాజమహేంద్రవరం సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ కార్యాలయంలోని విద్యుత్‌ చౌర్య నిరోధక విభాగంలోనే పని చేస్తున్నారు.

swpper-salary
ఇప్పటికే ఆమె సర్వీసు 40 ఏళ్లు దాటింది. రిటైర్‌మెంట్‌కు మరో నాలుగేళ్లు ఉంది. వెరసి. సుదీర్ఘ సర్వీసు కావడంతో జీతం కూడా భారీగా పెరుగుతూ వచ్చింది. రిటైర్‌మెంట్‌కు మరో నాలుగేళ్లు ఉంది. సీనియారిటీ, మంచి పనిమంతురాలు అవడంతో జీతం కూడా భారీగా పెరుగుతూ వచ్చిందామెకు. రమణమ్మ ఉదయం 8 గంటలకు భోజనం డబ్బాతో వచ్చి… రాత్రి 8 గంటలకు ఇంటికి వెళతారు. ఆమె ఏమీ చదువుకోలేదు. కేవలం సంతకం పెట్టేటంతే ఆమె చదువుకున్నారు.