ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రజలు మళ్లీ టీవీల ముందు కూర్చొని ఉండి న్యూస్ చానెల్స్ చూసే రసవత్తరమైన సమయం ఆసన్నమైంది.గత కొన్ని నెలల కిందట ముగిసిన అసెంబ్లీ సమావేశాలు మరోసారి మొదలు కాబోతున్నాయి.అయితే ఈరోజు నుంచి మొదలు కాబోతున్న ఈ సమావేశాలు చలికాలంలో కూడా హీటెక్కించక తప్పేలా లేవని చెప్పాలి.
గతంలో అనవసరమైన అంశాలపై మరియు వ్యక్తిగత దూషణలు మాత్రమే హైలైట్ అయ్యాయి.కానీ ఈసారి మాత్రం ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని సంచలన అంశాలపై తప్పక చర్చ నడవాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గద్దించారు.
అలాగే ప్రస్తుతం అమాంతం పెరిగిన ఉల్లిపై అలాగే తన దగ్గరకు వచ్చి వాపోయిన రైతులు మాత్రమే కాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఒక్క రైతు సమస్య కూడా పరిష్కారం అయ్యే దిశగా ఈ అసెంబ్లీ సమావేశాలు జరగాలని అలా కాకుండా ఈ ప్రధాన సమస్యలను కానీ దాటవేసే ప్రయత్నం చేస్తే తాను నిరాహార దీక్ష చేపట్టి సమస్యను ఉదృతం చేసి తీరుతానని తెలిపారు.ఇప్పుడు పవన్ మాటంటే అది ప్రజల్లోకి చాలా బలంగా వెళ్తుంది.మరి ఈ సమావేశాల్లో వైసీపీకి ఉన్న 150 మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తారో చూడాలి.