ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగే క్యాబినెట్ సమావేశం ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్లాక్ కేబినెట్ సమావేశ మందిరంలో ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఎస్ఐపీబీ ప్రతిపాదనలకు.. రూ.19వేల కోట్ల పెట్టుబడుల పరిశ్రమల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సమగ్ర కులగణన, ఏపీలో జర్నలిస్టుకు ఇళ్ల స్థలాల పంపిణీ పై కేబినెట్ చర్చించింది.
ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టులకు ఇచ్చిన హామీని సీఎం జగన్ ప్రభుత్వం నెరవేర్చనుంది. వర్సిటీలు, ట్రిపుల్ ఐటీలలో 3,200 పోస్టుల భర్తీకి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రూపు 1, గ్రూపు 2 పోస్టుల భర్తీపై చర్చలు జరిపింది ఏపీ కేబినెట్. దాదాపు రెండున్నర గంటలకు పైగా ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలో కీలక విషయాలపై చర్చలు జరిగాయి. ఇటు జర్నలిస్టులకు, అటు నిరుద్యోగులకు, ఉద్యోగులకు, కులగణన వంటి కీలక అంశాలపై చర్చలు జరిపారు.