ఏపీ మంత్రి వర్గ విస్తరణ…తెర మీదకు ఆ నలుగురు !

ap cabinet reshuffle

కొద్ది రోజులుగా ఏపీ మంత్రివర్గ విస్తరణ పై వార్త లొస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు మంత్రివర్గంలో ఒక్క ముస్లిం మంత్రి కూడా లేకపోవడంతో ముస్లింలను మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. పనిలో పనిగా ఇద్దరు ముగ్గురు ఆశావహుల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. అయితే ఇన్ని రోజులు ఊహాగానాలుగానే ఉన్న ఈ మంత్రివర్గ విస్తరణ మీద చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. తవరలో ఏపీలో కేబినెట్ విస్తరణ ఖాయమని, త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉండబోతుందని చెప్పారు. నిన్న అమరావతిలో మాట్లాడిన సీఎం మాజీ ఎంపీ, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు హరికృష్ణ మరణంతో విస్తరణ కాస్త ఆలస్యమైందని ఆయన అన్నారు.

ap cabinet

ఈ నెల 28న జరిగిన నారా హమారా.. టీడీపీ హమారా సభలో కూడా విస్తరణపై చంద్రబాబు ప్రకటన చేశారు. ముస్లింలను కేబినెట్‌లోకి తీసుకోబోతున్నట్లు చెప్పారు. ఆ తర్వాత ఎటువంటి ఊసు లేకపోవడంతో విస్తరణ ఉండదని భావించారు. కాని బాబు నిన్న చేసిన ప్రకటనతో ఆశావహులు తమ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యారు. కేబినెట్ రేసులో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ షరీఫ్ పేరు బలంగా వినిపిస్తోందట. అలాగే అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే అత్తర్ చాంద్‌పాషా పేరు కూడా పరిశీలనలో ఉందనే ప్రచారం జరుగుతోందట. వీరిద్దరు మాత్రమే కాదు..

chandra-babu

విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, శాసనమండలి ఛైర్మన్ ఫరూఖ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయట. వీరిలో చంద్రబాబు ఎవరివైపు మొగ్గు చూపుతారన్నది ఆసక్తిగా మారింది. అంతేకాదు.. టీడీపీ ఎన్టీఏ నుంచి బయటకొచ్చిన తర్వాత బీజేపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావులు రాజీనామా చేశారు. అప్పటి నుంచి రెండు శాఖలు ఖాళీగా ఉన్నాయి. రెండు శాఖలు ఖాళీగా ఉండటంతో ఇద్దర్ని కేబినెట్‌లోకి తీసుకుంటారా అనే చర్చ జరుగుతోంది. మరి చంద్రబాబు దీని పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

ap cabinet