ట్రింగ్ ట్రింగ్ … బాబుది భలే టైమింగ్.

AP CM Chandrababu Naidu speech At MSME Day Meeting

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఏపీ సీఎం చంద్రబాబు మీద చిత్రమైన కంప్లైంట్స్ వున్నాయి.ఆయనకి జనాన్ని రంజింపజేసే ప్రసంగం చేయడం రాదని ఓ కంప్లైంట్ అయితే, ఆయన మైక్ పట్టుకుంటే వదలరని ఇంకో కంప్లైంట్. ఒకే విషయం మీద రెండు భిన్నమైన కంప్లైంట్స్ ఎదుర్కొంటున్న బాబు బహిరంగ సభల్లో తన ధోరణి మార్చుకుంటారో లేదో తెలియదు గానీ అధికారులతో జరిగే చర్చలు, సమావేశాల విషయంలో మాత్రం రూట్ మార్చేశారు. ఒకప్పుడు ఆయనతో కాన్ఫరెన్స్ అంటే అధికారులు ఇంటిలో ఎప్పుడొస్తామో చెప్పలేము అని చెప్పేసి వచ్చేవారు. రివ్యూ మీటింగ్స్ లో బాబు చేసే సుదీర్ఘ ప్రసంగాలతో ఒక్కో సారి పనులకి కూడా ఆటంకం ఏర్పడేది. అయితే ఈ విషయాన్ని బాబుకి చెప్పడానికి కలెక్టర్లు సైతం మొహమాటపడ్డారు. కానీ కొన్ని పత్రికలో పదేపదే ఇదే అంశం మీద వార్తలు రావడం, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా తన కాలమ్ లో ఈ విషయాన్ని తప్పుపట్టటడం తో బాబు గారు అలెర్ట్ అయ్యారు. ఇక అదే సమయంలో వర్క్ బర్డెన్ తో బాబు గారి ఆరోగ్యం దెబ్బ తింటోందని కుటుంబ సభ్యులు గొడవ చేయడంతో అధికారులతో జరిగే సమీక్షా సమావేశాల్లో సమయపాలన పాటించాలని సీఎం చంద్రబాబు డిసైడ్ అయ్యారు.

చంద్రబాబు అనుకున్న దాన్ని అనుకున్నట్టు అమలు చేయడం మొదలెట్టారు. అంతర్జాతీయ సదస్సుల సందర్భంగా నిక్కచ్చిగా సమయాన్ని పాటించినట్టు కలెక్టర్లు సమావేశంలో బాబు వ్యవహరించారు. తనకి కేటాయించిన సమయంలో విషయాన్ని సూటిగా,సుత్తి లేకుండా చెప్పడానికి బాబు ట్రై చేశారు. అధికారులు సైతం అదే పద్ధతి పాటించేలా చూసారు. కొంతమంది అధికారులు సుదీర్ఘ ప్రసంగం చేస్తుంటే బాబు వారిని అడ్డుకుని మేటర్ సూటిగా చెప్పమంటూ ఒత్తిడి చేయడంతో సమావేశంలో అధికారులు చాలా మంది లోలోన నవ్వుకున్నారు. ఇక సమావేశం ముగింపు కూడా అనుకున్న టైం కే జరిగింది. ఇదంతా చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందంటున్నారు అధికారులు.