ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులను నిర్మిస్తామని ఇటీవల చివరి రోజు శాసనసభ సమావేశాల్లో భాగంగా ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ సంచలన వాఖ్యలు చేసిన సంగతి మనకు తెలిసిందే. కాగా రాష్ట్రంలో రాజధానిని అమరావతి నుండి ఎక్కడికి తరలించవద్దని, రాష్ట్రానికి రాజధానిగా అమరావతి ని ఏర్పాటు చేయాలనీ, అమరావతి ప్రాంతానికి చెందిన రైతులందరూ కూడా ఆందోళనలు చెప్పట్టారు. కాగా ఈ 3 రాజధానుల అంశాన్ని వ్యతిరేకిస్తూ రైతులు వరసగా 3 రోజుల ఆందోళనలని ప్రారంభించారు కూడా. కాగా నేడు ఉదయమే రెండవ రోజు దీక్ష కూడా చేపట్టారు.
కాగా అమరావతిని రాజధానిగా ప్రకటించేదాకా తమ ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని రైతులు వెల్లడించారు. ఇకపోతే అమరావతిలోని గ్రామస్థులు అందరు కూడా ఒక్కొక్కరుగా సదరు దేశ శిబిరానికి చేరుకుంటున్నారు. కాగా ‘3 రాజధానులు వద్దు- అమరావతే ముద్దు’ అనే నినాదంతో పోస్టర్లు కూడా ప్రదర్శిస్తున్నారు. ఇకపోతే రాజధానికోసం వారు చేసిన త్యాగాలను వృధా చేయొద్దని, వారి కుట్రపూరిత రాజకీయాలకు రైతుల జీవితాలను నాశనం చేయొద్దని తుళ్లూరులో ప్రధాన రహదారిపై వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు.