ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిసెంబర్ 17న విశాఖ జిల్లా పర్యటనకు సంబంధించి పక్కాగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున అధికారులను ఆదేశించారు. సీఎం పర్యటన సందర్భంగా బుధవారం ఆయన పోలీసు కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హాతో కలిసి విమానాశ్రయం, ఎన్‌ఏడీ ఫ్లైఓవర్, వీఎంఆర్‌డీఏ పార్కు, ఏయూ కన్వెన్షన్ సెంటర్, వైజాగ్ కన్వెన్షన్, పీఎం పాలెం ప్రాంతాలను పరిశీలించారు.
ఎయిర్‌పోర్ట్ వద్ద ప్రజాప్రతినిధుల కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఎన్‌ఏడీ ఫ్లైఓవర్, వీఎంఆర్‌డీఏ పార్కు వద్ద ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీశ, వీఎంఆర్‌డీఏ కమిషనర్ వెంకటరమణారెడ్డి, ఆర్‌డీవో పెంచల కిశోర్ పాల్గొన్నారు.