2014 లో ఒక్క అనంతపురం మినహా మిగిలిన సీమ జిల్లాలు వైసీపీ వైపు మొగ్గుజూపాయి. అందుకు అక్కడ వైసీపీ బలంగా ఉందట. ఓ కారణం అయితే ఇంకా జనం పెద్దగా గుర్తించని కారణాలు లేకపోలేదు. ఆ కారణాలే ఇప్పుడు 2019 లో సీమ తీర్పు మీద ప్రభావం చుపాయా అంటే ఔనని చెప్పక తప్పదు. 2014 ఎన్నికలకు ముందు జరిగిన అన్ని ఉపఎన్నికల్లో వైసీపీ జోరు ముందు టీడీపీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఇక ఆ పార్టీ అస్తిత్వం కూడా ప్రశ్నగా నిలిచింది. ఆ సమయంలో 2014 లో వైసీపీ గెలుపులాంఛనమే అన్న అభిప్రాయం బలంగా కనిపించింది.
దీంతో సీమ జిల్లాల్లో టీడీపీ శ్రేణులు సహా వైసీపీ వ్యతిరేక న్యూట్రల్ ఓటర్ సైతం మౌనం గా నిలిచాడు. ఈ ఎన్నికల్లో టీడీపీ జెండా ఎత్తుకుంటే వచ్చే ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం వల్ల ఇబ్బందులు తప్పవని భావించారు . భయపడ్డారు. దీంతో ఎన్నికలకు ముందే అక్కడ వైసీపీ విజయం నిశ్చయం అయిపొయింది. కానీ 2019 కి వచ్చేసరికి సీన్ మారిపోయింది. టీడీపీ గెలుపు మీద నమ్మకం ఉండటం తో ఎప్పటినుంచో టీడీపీ వ్యతిరేక రాజకీయాలు చేస్తున్న కుటుంబాలు వైసీపీ అధినేత జగన్ మీద నమ్మకం లేక పచ్చ జెండా నీడలో కి వచ్చాయి. ఇక దీంతో పాటు టీడీపీ లో ముఠా ల మధ్య సమన్వయము కోసం చంద్రబాబు చేసిన ప్రయత్నాలు కూడా సక్సెస్ అయ్యాయి. రామసుబ్బారెడ్డి , ఆదినారాయణ రెడ్డి కలిసి పని చేయడం కడప జిల్లాలో ఓ చరిత్ర. దీంతో పాటు రాయలసీమ ఎన్నడూ ఊహించని విధంగా వివిధ ప్రాజెక్టుల ద్వారా సాగు నీరు అందింది. వీటికి తోడు ప్రభుత్వ పధకాలు , పింఛన్లు , పసుపు కుంకుమ లాంటి వాటి ప్రభావం చెప్పక్కర్లేదు. ఇవన్నీ ప్రభావం చూపిన రాయలసీమలో ఓటరు తీర్పు ఎలా వుందో చూద్దాం.
కడప జిల్లాలో మొత్తం స్థానాలు —————10 .
టీడీపీ గన్ షాట్ గా గెలిచేవి.——————-3 .( రైల్వే కోడూరు , జమ్మలమడుగు , కమలాపురం )
వైసీపీ గన్ షాట్ గా గెలిచేవి ——————-5 .( కడప , బద్వేలు , రాయచోటి , పులివెందుల , ప్రొద్దటూరు )
పోటాపోటీ స్థానాలు ——————————2 .( రాజంపేట , మైదుకూరు )
ఈ రెండు చోట్ల గట్టి పోటీ నెలకొంది. అయితే రాజంపేటలో వైసీపీ , మైదుకూరులో టీడీపీ స్వల్ప ఆధిక్యంతో గెలిచే అవకాశం వుంది.
కడప ఫైనల్ ఫలితం ఇలా ..
టీడీపీ ———-4 .
వైసీపీ ———-6 .
ఇక కర్నూల్ జిల్లాలో మొత్తం స్థానాలు ———-14 .
టీడీపీ గన్ షాట్ గెలిచేవి ——. 7 .—(ఆళ్లగడ్డ , నందికొట్కూరు ,కర్నూల్ , నంద్యాల , పాణ్యం , ఆలూరు, పత్తికొండ )
వైసీపీ గన్ షాట్ గెలిచేవి ———-4 .( శ్రీశైలం ,మంత్రాలయం , బనగానేపల్లె , ఎమ్మిగనూరు )
పోటాపోటీ స్థానాలు —————3 .( ( డోన్ , కోడుమూరు , ఆదోని )
ఈ మూడు స్థానాల్లో డోన్ లో టీడీపీ , కోడుమూరులో వైసీపీ , ఆదోనిలో టీడీపీ స్వల్ప ఆధిక్యంతో గెలిచే ఛాన్స్ వుంది .
కర్నూల్ ఫైనల్ ఫలితం ఇలా
టీడీపీ ———-9 .
వైసీపీ ———-5 .
ఇక అనంతపురం జిల్లాలో మొత్తం స్థానాలు ——-14 .
టీడీపీ గన్ షాట్ గెలిచేవి ————————-8 ( ఉరవకొండ , తాడిపత్రి , రాయదుర్గం , అనంతపురం అర్బన్ , రాప్తాడు , కళ్యాణదుర్గం ,హిందూపూర్ , కదిరి )
వైసీపీ గన్ షాట్ గెలిచేవి ———————-3 ( పుట్టపర్తి , సింగనమల , మడకశిర )
పోటాపోటీ స్థానాలు ————————-3 .( ధర్మవరం , పెనుకొండ ,గుంతకల్ ).
పై మూడు స్థానాల్లో గుంతకల్ లో వైసీపీ ధర్మవరం , పెనుకొండలో టీడీపీ స్వల్ప ఆధిక్యంతో గెలిచే ఛాన్స్ వుంది.
అనంత పురం ఫైనల్ ఫలితం ఇలా ——-
టీడీపీ ———10 .
వైసీపీ ———-4 .
చిత్తూర్ జిల్లాలో మొత్తం స్థానాలు ———14 .
టీడీపీ గన్ షాట్ గెలిచేవి ——————6 .( కుప్పం ,పూతలపట్టు , గంగాధర నెల్లూరు , తిరుపతి , పీలేరు , తంబళ్లపల్లి )
వైసీపీ గన్ షాట్ గెలిచేవి —————2 ( మదనపల్లి , సత్యవేడు )
పోటాపోటీ స్థానాలు ——————6 ( పుంగనూరు ,చంద్రగిరి ,శ్రీకాళహస్తి , నగరి , చిత్తూర్ , పలమనేరు )
పై 6 స్థానాల్లో పుంగనూరు , కాళహస్తి , నగరి లో వైసీపీ , , చంద్రగిరి ,చిత్తూర్ , పలమనేరులో టీడీపీ కొద్దిపాటి మెజారిటీతో బయటపడతాయి.
చిత్తూర్ ఫైనల్ ఫలితం ఇలా ..
టీడీపీ ———9 .
వైసీపీ ———5 .
మొత్తం గా రాయలసీమలో మొత్తం 52 స్థానాలకు గాను టీడీపీ కి 32 , వైసీపీ 20 స్థానాల్లో గెలవబోతున్నాయి.