విజయసాయి మీద ఏపీ ప్రభుత్వం ప్రత్యేక నిఘా

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

విజయ సాయి రెడ్డి ఒకప్పుడు ఈ పేరు జగన్ కేసులలో ఏ 2 కిందనే తెలుగు రాష్ట్రాల ప్రజలకి తెలుసు, అయితే జగన్ కీ ఆయనకీ మధ్య ఏమి సంభందాలు ఉన్నయో ఏమో, అసలు రాజకీయ అనుభవమే లేని ఆయనని తీసుకు వచ్చి రాజ్యసభ సభ్యుడిని చేశారు. ఏనాడైతే ఆయన వైసీపీ తరపున రాజ్యసభ సభ్యుడు అయ్యాడో ఆనాటి నుండి తనదయిన శైలితో విరుచుకు పడుతూ తెలుగుదేశం పార్టీకి కంట్లో నలుసులా మారాడు.

అయితే అటువంటి వ్యక్తి మీద ప్రభుత్వం నిఘా పెట్టిందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. విజయసాయిరెడ్డిపై ప్రత్యేక నిఘా పెట్టిన ఉదంతం ఇప్పుడు బట్టబయలు అవ్వడంతో వైసీపీ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగినట్టు అయ్యింది. సాధారణంగా ప్రతిపక్షాల మీద ప్రభుత్వ ఇంటలిజెన్స్ ని ప్రయోగించడం పరిపాటి, ప్రతిపక్షాల, ప్రతిపక్ష నాయకుల కదలికలు, వారి ప్రణాలికలు తెలుసుకునేందుకు ప్రభుత్వాలు పోలిస్ లో ఇంటలిజెన్స్ విభాగాన్ని వాడుతూ ఉంటారు. అయితే అది అందరికీ తెల్సిన విషయమే అయినా పెద్దగా ఎక్కడా దీని ప్రస్తావన ఉండదు.

తెలుగు దేశానికీ కంట్లో నలుసు లా మారిన విజయ్ సాయి రెడ్డి మీద ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు ప్రచాచరం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని నిజం చేసేలా ఇప్పుడు ఏకంగా ప్రెస్ మీట్ లో లైవ్ లో ఉన్న సమయంలో విజయ్ సాయి రెడ్డి చేసిన ఒక వ్యాఖ్య మాత్రం ఇప్పుడు అధికార-ప్రతిపక్షాల లో కలకలం రేపుతోంది. విజయసాయిరెడ్డి నిర్వహించిన ఓ విలేకరుల సమావేశంలో ఇంటెలిజెన్స్ పోలీస్ ఒకరు ప్రత్యక్షమయ్యారు.

ఓ మీడియా సంస్థ ప్రతినిధి లాగానే మిగతా మీడియా ప్రతినిధుల మాదిరే ఆయన కూడా విలేకరుల సమావేశంలో ఉండి విజయసాయిరెడ్డి చెప్పిన అంశాల ను శ్రద్దగా నోట్ చేస్తుండగా ఆయన్ను విజయసాయిరెడ్డి గుర్తుపట్టారు. `మీరు ఇంటెలిజెన్స్ అధికారి కదా ఇది విలేకరుల సమావేశం. ఇక్కడ ఏబీ వెంకటేశ్వర రావు(ఇంటలిజెన్స్ ఛీఫ్) మనుషులకి పనేం లేదు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటె నన్ను తర్వాత సంప్రదించండి. మాట్లాడతా, ఇప్పుడయితే మీరు దయచేసిన వెళ్లిపొండి అంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం విజయ్ సాయి రెడ్డి మీద ప్రత్యేక నిఘా పెట్టిందన్న విషయం బట్టబయలు అయినట్టయ్యింది.