మూర్తి మరణం…చంద్రబాబు దిగ్బ్రాంతి…!

CM Chandrababu Naidu Expresses Shock Over Death Of MVVS Murhy

రోడ్డు ప్రమాదాల్లో అనేకమంది తెలుగుదేశం పార్టీ నేతలను కోల్పోవడం తనను కలచివేస్తోందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. గీతం విద్యాసంస్థల వ్యవస్థాపకుడు, పార్లమెంట్ సభ్యుడిగా, ఎమ్మెల్సీగా సేవలందించిన ఎంవీవీఎస్ మూర్తి మరణం గురించి ఆయన సంతాపాన్ని వెలిబుచ్చారు.

mvss-murty

ఆయన మృతి వార్త విని తాను దిగ్భ్రాంతికి గురయ్యానని అన్నారు. గాంధీ ఆదర్శాల కోసం పనిచేసిన ఆయన గాంధీ జయంతి నాడే దారుణ ప్రమాదానికి గురికావడం యాదృచ్చికమని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని అన్నారు. ఎంపీగా, ఎమ్మెల్సీగా, విద్యావేత్తగా, విద్యాదాతగా చెరగిపోని ముద్ర వేసిన వ్యక్తి ఆయనని అన్నారు. మూర్తి మరణం విద్యా రంగానికి, రాజకీయ రంగానికీ తీరనిలోటని, తనకు అత్యంత సన్నిహితుల్లో ఆయన కూడా ఒకరని మూర్తితో తనకున్న అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.

cm-shock