మెగా ఫాన్స్ కి శుభవార్త…!

AP Govt Allows Six Shows Per Day For Vinaya Vidheya Rama Movie

చరణ్ కథానాయకుడిగా భారీ బడ్జెట్ తో ‘వినయ విధేయ రామ’ సినిమా నిర్మితమైంది. బోయపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథానాయికగా కైరా అద్వాని అలరించనుంది. సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని మరో 3 రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకూ ఈ సినిమా స్పెషల్ షోలకి గాను ఏపీ ప్రభుత్వం నుంచి అనుమతిని పొందింది. సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతున్న ‘వినయ విధేయ రామ’ సినిమా ప్రత్యేక షోల ప్రదర్శనకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

జనవరి 11 నుంచి జనవరి 19 వరకు ఉదయం రెండు ప్రత్యేక షోలను ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చింది. ఉదయం 5 గంటల నుంచి 11 గంటల మధ్యలో ఈ షోలు ప్రదర్శించబడతాయని పేర్కొంది. చిత్ర బృందం వినతి మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించింది. దీంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పండుగ రోజులలో ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకూ అదనంగా మరో రెండు షోలు వేస్తారు. ఇలా అదనపు షోలకి అనుమతి లభించడం వలన, ఈ సినిమా వసూళ్లు మరింతగా పెరిగే అవకాశం వుంది. బోయపాటి మార్క్ మాస్ అంశాలు, చరణ్ యాక్షన్,. కైరా అద్వాని గ్లామర్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ సినిమా తప్పకుండా చరణ్ కి మరో బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.