సాయి పల్లవి అలా చేసిందా…?

Sai Pallavi Returns Her Remuneration

నటించిన మొదటి సినిమాతోనే సాయి పల్లవి మంచి క్రేజ్ తెచ్చేసుకుంది. స్వతహాగా మలయాళీ అయిన ఈ భామ ఆ చిత్ర సీమను కూడా వదలలేదు, ఇక తమిళం సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పకర్లేదు. దీన్తి తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సాయిపల్లవికి భారీ క్రేజ్ ఏర్పడింది. గ్లామర్ కు ప్రాధాన్యమున్న, ఏక్స్పోసింగ్ లాంటివి లేని పాత్రను దేనిని అంగీకరించినా ఆ పాత్రలో ఎంతో సహజంగా ఒదిగిపోవడం. సాయిపల్లవి తప్ప మరొకరు ఆ పాత్రను చేయలేరని అనిపించుకోవడం ఆమె ప్రత్యేకత. ఆమె కథను తప్ప పారితోషికానికి కూడా పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వదు అని ఇండస్ట్రీ జనాలు అంటూ ఉంటారు.

అలాంటి సాయిపల్లవి మరో విషయంలోనూ తన ప్రత్యేకతను చాటుకుంది. తాను తీసుకున్న పారితోషికాన్ని తిరిగి ఇచ్చేసింది. ఆమె తాజా చిత్రంగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు ‘పడి పడి లేచె మనసు’ వచ్చింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేక పోయింది. దాంతో సాయిపల్లవి ఈ సినిమాకి గాను తాను తీసుకున్న పారితోషికాన్ని తిరిగి ఇచ్చేసిందట. సాధారణంగా తమ సినిమాలు ఆడనప్పుడు స్టార్ హీరోలు కొంతమంది ఇలా చేస్తుంటారు. అలా సాయిపల్లవి వ్యవహరించడంతో ఆమెను ప్రసంశలతో ముంచెత్తుతున్నారు ఇండస్ట్రీ వర్గాలు.