ఏపీ ప్రభుత్వం ‘సచివాలయ’ పరీక్ష గల్లంతు : స్పందించిన ఏపీపీఎస్సీ ఛైర్మన్

ఏపీ ప్రభుత్వం 'సచివాలయ' పరీక్ష గల్లంతు : స్పందించిన ఏపీపీఎస్సీ ఛైర్మన్

ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మకంగా పంచాయత్ రాజ్ శాఖ ద్వారా నిర్వహించిన గ్రామ సచివాలయ పరీక్షల ప్రశ్న పత్రం లీక్ అయిందని వార్తలు వినిపించించాయి. పరీక్ష పత్రాల ముద్రణ మరియు రూపకల్పన సంబంధించి గోప్యంగా జరపాల్సిన వ్యవహారాలను పంచాయతీ రాజ్ శాఖే చూసుకుందని ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయభాస్కర్ నిన్న మీడియాతో చెప్పారు.

సచివాలయ పరీక్షలతో సంబంధం లేదని చెప్పారు. ఏపీపీఎస్సీ చైర్మన్ ఆధ్వర్యంలో జరిగిన బోర్డుసమావేశంలో పేపర్ లీక్‌పై సుదీర్ఘ చర్చ జరిగింది. పరీక్షలు ప్రభుత్వమే నిర్వహించిందని, సంబంధిత శాఖలే స్పష్టత ఇవ్వాలన్నారు.

ఇదే కాకుండా పేపర్ లీకేజీ కారణం వల్లనే ఎవరైతే ఔట్‌సోర్సింగ్ పద్దతిలో ఉద్యోగం చేస్తున్న వారు మొదటి స్తానంలో ఉన్నారని వారికి ముందే పరీక్ష పత్రం తెలుసన్నవార్తలు వచ్చాయి.

నేటి నుంచి ‘సచివాలయ’ ధ్రువపత్రాల పరిశీలన కూడా ప్రారంభం కాబోతుంది. ఏపీపీఎస్సీలోనే అవకతవకలు జరిగాయని ఆరోపణలు బయటకి వచ్చాయి. సచివాలయ పరీక్షలతో సంబంధం లేదని ఆ వ్యవహారం తమకు తెలియదని ఛైర్మెన్ చెప్పారు.