గేమ్ ఛేంజర్, డాకు మహరాజ్ మూవీ లకు షాకిచ్చిన ఏపీ హైకోర్టు

AP High Court gives shock to Game Changer and Daku Maharaj movies
AP High Court gives shock to Game Changer and Daku Maharaj movies

సంక్రాంతి సందర్భంగా టాలీవుడ్ నుంచి భారీ మూవీ లు రాబోతున్నాయి. ఈ నెల 10న రామ్ చరణ్ మూవీ ‘గేమ్ ఛేంజర్’, 12న బాలకృష్ణ మూవీ ‘డాకు మహరాజ్’ విడుదల కాబోతున్నాయి.

‘గేమ్ ఛేంజర్’, ‘డాకు మహరాజ్’ టికెట్ రేట్లను పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతించింది. అయితే, టికెట్ ధరలని పెంచడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పలువురు పిటిషన్లు వేశారు. నిబంధనలకి విరుద్ధంగా టికెట్ ధరల పెంపు జరిగిందని, ప్రభుత్వ ఉత్తర్వులని రద్దు చేయాలని పిటిషన్లలో వారు కోరారు.

AP High Court gives shock to Game Changer and Daku Maharaj movies
AP High Court gives shock to Game Changer and Daku Maharaj movies

ఈ పిటిషన్ ని విచారించిన ఏపీ హైకోర్టు సంచలన తీర్పుని వెలువరించింది. ఈ రెండు మూవీ ల టికెట్ రేట్లను 14 రోజులు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతించగా… ఆ అనుమతిని హైకోర్టు 10 రోజులకి కుదించింది. హైకోర్టు తీర్పు మేరకి సినిమాలు విడుదలైన 10 రోజుల వరకు పెంచిన టికెట్ ధరలు అందుబాటులో ఉంటాయి. హైకోర్టు నిర్ణయంతో ఈ రెండు మూవీ ల కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడనుంది.