పవన్ కళ్యాణ్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు : ఏపీ హోంమత్రి

పవన్ కళ్యాణ్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు : ఏపీ హోంమత్రి

పవన్ కళ్యాణ్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఏపీ హోంమత్రి మేకతోటి సుచరిత అన్నారు. పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ తన సీటును కూడ తాను గెలుచుకోలేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నారు. అలాంటీ వ్యక్తిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదని ఆమె ఎద్దెవా చేశారు. మరోవైపు ఆయన మతమార్పిడులపై చేసిన వ్యాఖ్యలను మంత్రి తీవ్రంగా ఖండించారు.

బలవంతంగా ఎవరు మతాన్ని మార్చుకోరని ఆమె వివరణ ఇచ్చారు. , ప్రలోభాలతో మతాల మధ్య మార్పిడిలు జరగవని , మతమనేది ఒక విశ్వాసామని చెప్పారు. రాయలసీమ పర్యటనలో ఉన్న జనసేన అధినత పవన్ కళ్యాణ్ మరోసారి సీఎం జగన్‌మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై విరుచుకుపడ్డ విషయం తెలిసిందే సీఎం ప్రోద్బలంతోనే మతమార్పిడులు జరుగుతున్నాయని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. విజయవాడన సీఎం నివాసానికి సమీపంలోనే నలబై మందిని మతమార్పిడులు చేశారని పవన్ కళ్యాణ్ తీవ్ర ఆరోపణలు చేశారు.

ఇవి ఎవరి ప్రోద్బలంతో జరగుతున్నాయో సీఎం సమాధానం చెప్పాలని నిలదీశారు.. ఇందుకు సంబంధించి తాను వీడీయోను కూడ రిలీజ్ చేస్తానని , ఆ వీడీయోను మీడియా సెన్సెషన్ వార్తగా ప్రచురించుకోవచ్చని కూడ కోరారు. ధర్మం గురించి మాట్లాడే వ్యాఖ్యలకు తాను ఎప్పుడు కట్టుబడి ఉంటానని వాటి నుండి ఎప్పుడు వెనక్కి వెళ్లనని పవన్ స్పష్టం చేశారు.