ఏపీలో రానున్న మార్చినెలలో ఏర్పడనున్న మూడు ఎమ్మెల్సీ పదవులకు ఎన్నికల ప్రచారంతో పాటు విస్తృతంగా ప్లేక్సీలు ఏర్పాటుచేసి ఓటర్ల నమోదులోనే ఆశావహులు పోటా పోటీగా నమోదు చేయిస్తున్నారు. ఓటర్ల నమోదుకు మరోరెండురోజులు గడువుండగా పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఓటరు నమోదు ప్రక్రియ నిన్నటితో ముగిసింది. బరిలోదిగే అభ్యర్థులు కృష్ణా-గుంటూరు జిల్లాల్లోని డిగ్రీ,పీజీ కళాశాలలతో పాటు వివిధ కళాశాలలను, మారుమూల ప్రాంతాల్లో ఆశా హులు తమ సొంత ఖర్చులతో టీంలను ఏర్పాటుచేసి దాదాపు 2.70లక్షల మందిని చేర్పించి ఉండవచ్చని ఒక అంచనా. వీరిలో ఇదివరకే నమోదు చేసుకొన్న ఓటర్లు కూడా ఉన్నారు. వాస్తవంగా మార్చినెలలో ఒక ఉపాధ్యా, రెండు పట్టభద్రుల నియోజకవర్గాలతో పాటు,ఎమ్మెల్యేల కోటాలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ప్రస్తుతం ఎమ్మెల్సీలలుగా కొనసాగుతున్న యనమల రామకృష్ణుడు, శమంతకమణి, ఆదిరెడ్డి అప్పారావు, లక్ష్మీశివకుమారిలు పదవీ విరమణ పొందనున్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎన్నికైన గాదె శ్రీనివాసులు నాయుడు ఎమ్మెల్సీ పదవి విరమణ చేయనున్నారు. అయితే టిడిపి బలపరిచే అభ్యర్థులపై అధిష్టానం ఇంతవరకు ఎవరిపేర్లు ప్రస్తావనకు తీసుకొని రావడం కానీ ప్రకటించడం కానీ జరగకపోయినా ఆశావహులు మాత్రం అధిష్టానంపై నమ్మకం పెట్టుకొని ఎంపీ, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతల ద్వారా అధిష్టానం దృష్టిలో’ పడేలా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పట్టభద్రుల నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ రవికిరణ్‌వర్మ ఒక్కరే ఆశలు పెట్టుకొని అధిష్టానం మరో అవకాశం తనకే వస్తోందనే దీమాతో ఉండగా మరో ముగ్గురు, నలుగురు అభ్యర్థుల కూడా ఎవరికీ వారు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఆదిత్యా విద్యాసంస్థల చైర్మన్ ఎన్.శేషారెడ్డి, యూటిఎప్ టీచర్స్ యూని యన్ నుంచి ఐ.వేంకటేశ్వరరావు, హిప్నో కమలాకర్‌లు పోటీకి ముమ్మర ప్రయత్నాల్లో ఉన్నారు. ఆ జిల్లాల నుండి దాదాపు 15వేలమంది ఉపాధ్యా యులు ఓటర్లుగా నమోదైయ్యారు. ఇక కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల కోటాలో బలమైన నేతలే బరిలో దిగేందుకు పట్టుబడుతున్నారు. వీరిలో మాజీ ఎమ్మెల్సీ, జెడ్పి మాజీ చైర్మన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, రాష్ట్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్‌గా పనిచేసిన దాసరి రాజామాస్టారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సీనియర్ నేత,న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణప్రసాద్,చిగురుపాటి వరప్రసాద్ లు తమ తమ ప్రయత్నాల్లో ఉన్నారు. వీరిలో ఎవరిని అధిష్టానం ఎంపిక చేయనుదో మరి ?