ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. 11500పైగా పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇవ్వగా.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే నోటిఫికేషన్లు రానున్నాయి. 340 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు, 11356 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. ఈ మేరకి జనవరిలో రానున్న నోటిఫికేషన్ కి పోలీసు నియామక మండలి పోలీసు శాఖలో ఖాళీల వివరాలను ప్రభుత్వానికి అందజేసింది.
పోలీసులకు వీక్లీ ఆఫ్లు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ప్రకటించైన సంగతి తెలిసిందే. అధికారంలోకి రాగానే వీక్లీ ఆఫ్ అమలుకు ఆదేశాలు జారీచేయగనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 19వ తేదీనుండి పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చే నేపత్యంలో 30శాతం సిబ్బందిని అదనంగా తీస్కోవాల్సి ఉంది. కావున అవవసరమైన ఖాళీల భర్తీకి కి పోలీసు నియామక మండలి సన్నాహాలు ఏర్పాటు చేస్తూ దశలవారీగా పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వానికి ఖాళీల వివరాలను తెలిపింది.