AP Politics: నేడు ఏపీ కేబినెట్ భేటీ..వారికి 3000 పెన్షన్ ?

AP Politics: AP Cabinet meeting today..3000 pension for them?
AP Politics: AP Cabinet meeting today..3000 pension for them?

నేడు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభం అవుతుంది. మిచౌంగ్ తుఫాన్, పంట నష్టం, పునరావాస కార్యక్రమాలు, ప్రభుత్వం చేపట్టిన సహాయ, పెన్షన్‌ పెంపు సహా పలు కీలక అంశాలపై ఏపీ కేబినెట్‌ చర్చించనుంది.

ముఖ్యంగా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు మరియు చేతి వృత్తిదారులకు ప్రస్తుతం ఇస్తున్న 2750 రూపాయల పెన్షన్ ను వచ్చే నెల నుంచి 3000 రూపాయలకు ప్రభుత్వం పెంచనుంది. ఈ ప్రతిపాదనకు నేడు జరిగే కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నిర్ణయంతో 65.33 లక్షల మందికి లబ్ధి చేకూరాలని ఉంది. అంతేకాకుండా గ్రామాలలో కులాయిలా ఏర్పాటు కాంట్రాక్టును ఇతర కాంట్రాక్టర్లకు కాకుండా… డ్వాక్వా మహిళలకు ఆ సంఘాలకు ఇచ్చే విషయంపై కూడా జగన్మోహన్ రెడ్డి కేబినెట్ నిర్ణయం తీసుకోంది. ఇవాళ సాయంత్రం లోపు దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది.