“పిండం” – కొన్ని థ్రిల్స్ మాత్రమే

“పిండం” – కొన్ని థ్రిల్స్ మాత్రమే
Pindam Movie

విడుదల తేదీ : డిసెంబర్ 15, 2023

నటీనటులు:  శ్రీరామ్, ఖుషి రవి, ఈశ్వరీ రావు, శ్రీనివాస్ అవసరాల, బేబీ చైత్ర, బేబీ లీషా, విజయలక్ష్మి, శ్రీలత, రవివర్మ, తదితరులు

దర్శకుడు : సాయికిరణ్ దైదా

నిర్మాత: యశ్వంత్ దగ్గుమాటి

సంగీతం: కృష్ణ సౌరభ్ సూరంపల్లి

సినిమాటోగ్రఫీ: సతీష్ మనోహరన్

ఎడిటర్: శిరీష్ ప్రసాద్

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ సినిమా లో రీసెంట్ టైం హారర్ బ్యాక్ డ్రాప్ లో డీసెంట్ బజ్ ని సెట్ చేసుకున్న సినిమా లలో “పిండం” కూడా ఒకటి. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం రండి.

కథ :

ఇక కథలోకి వస్తే..తాంత్రిక విద్యలో ఆరితేరిన ప్రముఖ తాంత్రికురాలు అయినటువంటి అన్నమ్మ(ఈశ్వరి రావు) ని తన రీసెర్చ్ కోసం లోక్ నాథ్ (శ్రీనివాస్ అవసరాల) ఇంటర్వ్యూ చేస్తారు . అలా ఆమె కెరీర్ లో అత్యంత క్లిష్టమైన కేసు ఏదైనా ఉంది అనే ప్రశ్నకి 1990 దశకంలో సుక్లాపేట్ లో ఒక కుటుంబానికి జరిగిన సంఘటన కోసం చెప్తుంది. ఆంటోనీ(శ్రీరామ్) తన భార్య గర్భవతి అయినటువంటి మేరీ(ఖుషి రవి) అలాగే తన తల్లి సహా తమ ఇద్దరు పిల్లలతో ఒక ఇంట్లో దిగుతారు. కానీ ఆ తర్వాత నుంచి వారి ఇంట్లో అంతా అనుమానాస్పదంగా జరుగుతూ ఉంటుంది. మరి ఆ ఇంట్లో అసలు వాళ్ళని పీడిస్తుంది ఏంటి? అంతకు ముందు ఆ ఇంట్లో ఏమన్నా జరిగిందా? జరిగితే దాని నుంచి వారి కుటుంబం ఎలా బయట పడుతుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే.

“పిండం” – కొన్ని థ్రిల్స్ మాత్రమే
Pindam Movie

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమా లో మెయిన్ లీడ్ లో కనిపించే అంతా సాలిడ్ పెర్ఫామెన్స్ లని అందించారు. నటి ఈశ్వరీ రావు ఒక తాంత్రికురాలుగా సాలిడ్ పెర్ఫామెన్స్ ని అందించారు. అలాగే నటుడు శ్రీరామ్ ఖుషి రవిలు కూడా చాలా సహజమైన పెర్ఫామెన్స్ ని అందించారు.

ఇంకా వీరితో పాటుగా వారి చిన్న కూతురుగా కనిపించిన చిన్నారి నటి అయితే సినిమాలో ఆశ్చర్య పరుస్తుంది. చాలా నాచురల్ గా మంచి ఎమోషన్స్ ని అలవోకగా తాను పండించింది. ఇక సినిమాలో స్టార్టింగ్ ఎపిసోడ్ కూడా థ్రిల్ చేస్తుంది. వీటితో పాటుగా సినిమాలో ప్రీ క్లైమాక్స్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా ఇంప్రెస్ చేస్తుంది. ఇంకా కొన్ని కొన్ని ఎలిమెంట్స్ అయితే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో థ్రిల్ చేస్తాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమా కొన్ని పార్ట్స్ వరకు ఓకే అనిపిస్తుంది. కానీ ఈ సినిమాలో నిడివి చాలా పెద్దది. దర్శకుడు చెప్పాలి అనుకున్న పాయింట్ ని అనవసరంగా సాగదీసినట్టుగా అనిపిస్తుంది. క్రిస్పీగా కొన్ని సీన్స్ ని తగ్గించి కట్ చేయాల్సింది. అలాగే చాలా వరకు సీన్స్ ముందే అర్ధం అయ్యేలా మరీ అంత థ్రిల్ చేయవు భయపెట్టవు కూడా..

ఇంకా సినిమా మెయిన్ పాయింట్ లోకి వెళ్ళడానికి కూడా చాలా సమయం పడుతుంది. దీనితో అసలు సినిమాలో పాయింట్ కి తీసుకెళ్లడానికి ఇంత సాగదీయాలా అనిపిస్తుంది. వీటితో పాటుగా కొన్ని సీన్స్ రెగ్యులర్ గా ఎన్నో హారర్ సినిమాల్లో చూసిన సన్నివేశాల్లోనే అనిపిస్తాయి.

ఇక నటుడు శ్రీనివాస్ అవసరాల రోల్ బానే ఉంటుంది కానీ క్లైమాక్స్ లో ఇచ్చిన ఎండింగ్ మాత్రం అంత కన్విన్స్ చేసే విధంగా ఉండదు. అలానే లాజిక్స్ కూడా కొన్ని చోట్ల బాగా మిస్ అయ్యాయి.

సాంకేతిక వర్గం :

ఈ సినిమా లో నిర్మాణ విలువలు బాగున్నాయి. అయితే టెక్నీకల్ గా మాత్రం కొన్ని జాగ్రత్తలు మిస్ అయ్యాయి. 1990 ల టైం లో కూడా ఇప్పుడు ఉన్న వస్తువులు కూడా కనిపిస్తాయి. ఇంకా మ్యూజిక్ సినిమాలో బాగా వర్కౌట్ అవుతుంది. అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఎడిటింగ్, వి ఎఫ్ ఎక్స్ లు ఇంకా బెటర్ గా చేయాల్సింది.

ఇక దర్శకుడు సాయి కిరణ్ దైద విషయానికి వస్తే..తాను ఈ సినిమా స్ట్రిక్ట్ గా యావరేజ్ వర్క్ మాత్రమే అందించాడు అని చెప్పాలి. తాను అనుకున్న కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ దానిని ప్రెజెంట్ చేయడాన్ని బాగా ల్యాగ్ చేసాడు. చాలా అనవసర సన్నివేశాలు తగ్గించి అనుకున్న పాయింట్ ని కాస్త త్వరగా చెప్పే ప్రయత్నం చేయాల్సింది. అలాగే లాజిక్స్ కూడా మిస్ అయ్యాడు. ఇంకా క్లైమాక్స్ కూడా బెటర్ గా ప్రెజెంట్ చేయాల్సింది.

తీర్పు :

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “పిండం” సినిమా లో మెయిన్ లీడ్ నటీనటులు ప్రామిసింగ్ పెర్ఫామెన్స్ లు అందించారు. అలాగే కొన్ని చోట్ల థ్రిల్ ఎలిమెంట్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి. కానీ మిగతా సినిమా అంతా సాగదీతగా సాగుతుంది. అలాగే కొన్ని సీన్స్ రెగ్యులర్ గానే అనిపిస్తాయి. వీటితో అయితే కొంతమేర ఓకే అని అనిపిస్తుంది.