AP Politics: ఏపీలో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్.. ఎందుకంటే..?

AP Politics: Arogyashri services will be closed in AP from today.. because..?
AP Politics: Arogyashri services will be closed in AP from today.. because..?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేసేందుకు ప్రైవేట్ ఆస్పత్రులు సిద్ధమయ్యాయని వార్తలు వస్తున్నాయి. ఈనెల 25 నుంచి అంటే ఇవాళ్టి నుంచే ఆరోగ్య నెట్వర్క్ పరిధిలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో సేవలు అందించబోమని అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారని న్యూస్‌ వైరల్‌ అయింది.

ప్రతి జిల్లాలోనూ నెట్వర్క్ ఆసుపత్రులకు రూ. 50 నుంచి రూ. 100 కోట్ల మేర ప్రభుత్వం బకాయి ఉంది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా రూ. 1000 కోట్లకు పైగా బిల్లులను పెండింగ్ లో పెట్టింది. ఈ తరుణంలోనే..ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేసేందుకు ప్రైవేట్ ఆస్పత్రులు సిద్ధమయ్యాయని వార్తలు వస్తున్నాయి.

అయితే.. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సేవలు యధావిధిగా ప్రజలకు అందిస్తామని ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడు డా.నరేంద్ర రెడ్డి తెలిపారు. అసోసియేషన్ పరిధిలోని 1,150 ఆసుపత్రుల్లో సేవలు నిరంతరాయంగా అందుతాయని పేర్కొన్నారు. సేవలు నిలిపివేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దన్నారు.