ఆంధ్రప్రదేశ్లోని మున్సిపల్ కార్మికులు 14 రోజుల పాటు సమ్మె చేశారు. పురపాలక సంఘాల్లోని పారిశుద్ధ కార్మికులు ఇంజనీరింగ్ ఎలక్ట్రిక్ సిబ్బంది డిమాండ్ల సాధన కోసం రెండు వారాలుగా పోరాటం చేస్తున్నారు. ఇప్పటికే చాలా సార్లు ప్రభుత్వంతో చర్యలు జరిగినప్పటికీ ఫలితం లేదు దీంతో సమ్మె కొనసాగిస్తున్నామని మున్సిపల్ కార్మికులు ఆందోళన చేస్తున్నారు హిందూపురంలోని మునిసిపల్ కార్మికులు సమ్మె చేస్తున్న శిబిరానికి ఎమ్మెల్యే నందమూరి బాలయ్య వెళ్లారు.
మున్సిపల్ కార్మికుల సమ్మెలో పాల్గొని సపోర్ట్ ఇచ్చారు తమని పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని, కార్మికులు బాలయ్య దృష్టికి తీసుకువెళ్లారు ఈ సందర్భంగా బాలయ్య రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని.. ప్రజలే బుద్ధి చెప్పాలని మండిపడ్డారు ప్రభుత్వంపై ప్రజలు విసిగి చెందారని అన్నారు. కష్టపడి కార్మికులు పనిచేస్తున్నారని, వాళ్ళ సమస్యని తీర్చాలని అన్నారు. బాలయ్య వైసిపి పాలనలో ప్రశ్నించే వారిపై దాడులు చేస్తున్నారని విమర్శించారు బాలయ్య మూడు నెలల్లో టిడిపి ప్రభుత్వం వస్తుందని అన్ని విధాలుగా కార్మికుని ఆదుకుంటుందని చెప్పారు.