బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో 21వ తేదీ వరకు మాత్రమే సెలవు ప్రకటించారని…22వ తేదీన దేశం మొత్తం చాలా రాష్ట్రాల్లో విద్యా సంస్థలు సెలవు ప్రకటించారని గుర్తు చేశారు. ఏపీ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా ఆ రోజు సెలవు ప్రకటించలేదని ఆగ్రహించారు. రామ మందిరం ప్రారంభం భారతీయుల శతాబ్దాల కల, దశాబ్దాల పోరాటమని…ఈ నెల 22వ తేదీన బాలరాముని విగ్రహ ప్రతిష్ట నిర్వహించబోతున్నారని వెల్లడించారు.
21వ తేదీ వరకు మాత్రమే జగన్ ప్రభుత్వం సెలవులు ఇవ్వడం వెనక దురుద్దేశం ఉందని అర్థం అవుతుందని…22వ తేదీన కూడా సెలవు ప్రకటించాల్సి ఉన్నా.. ఉద్దేశపూర్వకంగానే ఆరోజు సెలవు ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. ఇప్పటికే ప్రైవేటు విద్యా సంస్థలు సెలవులు ప్రకటించాయని… రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహావిష్కరణ వల్ల 21 వరకు సెలవు ఇవ్వడాన్ని బీజేపీ పక్షాన హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. అయోధ్య ఘట్టం అందరూ తిలకించేలా ఏపీ ప్రభుత్వం 22వ తేదీనన సెలవు ప్రకటించాలని డిమాండ్ చేశారు.