ఏపీలోని డీఎస్సీ నోటిఫికేషన్ అంశం మీద బొత్స సత్యనారాయణ విద్యా శాఖ అధికారులతో సమావేశం అయ్యారు ఈ విషయంపై బొత్స సత్యనారాయణ చాంబర్ లో కీలక సమీక్ష చేపట్టారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా దీనికి హాజరయ్యారు. 6,100 టీచర్ పోస్టుల భర్తీకి క్యాబినెట్ ఆమోదించిన విషయం తెలిసిందే. నోటిఫికేషను ప్రకటన విధి విధానాల ఖరారు పై చర్చ అయితే సాగుతోంది.
టీచర్ పోస్టుల సంఖ్యని పెంచాలని డిఎస్సీ అభ్యర్థులు చేస్తున్న ఆందోళన మీద కూడా చర్చిస్తున్నారు. జనవరి 31న జగన్ అధ్యక్షతన అమరావతి సచివాలయంలో జరిగిన క్యాబినెట్ భేటీలో టీచర్ పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్నారట. మంత్రివర్గ సమావేశం లో డీఎస్సీ నిర్వహణ నోటిఫికేషన్ల విడుదలపై చర్చించారు. 6,100 టీచర్ పోస్టులు భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయడానికి ఆమోదం తెలిపారు.