ప్రకాశం జిల్లా కనిగిరిలో తెదేపా అధినేత చంద్రబాబు రెండోరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కనిగిరి పార్టీ కార్యాలయం పక్కన ఏడాదిగా ఇన్‌ఛార్జి ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్‌ను ఆయన పరిశీలించారు. ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా పైలాన్‌ను ఆవిష్కరించి, స్వయంగా భోజనాలు వడ్డించారు. కార్యకర్తలు, అభిమానులతో ఫొటోలు దిగి ఉత్సాహపరిచారు. అలాగే పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు రూపొందించిన పాటల సీడీని ఆవిష్కరించారు. వైకాపాకు చెందిన పలువురు నాయకులకు పార్టీ కండువా కప్పి తెదేపాలోకి ఆహ్వానించారు. జిల్లాకు చెందిన పలువురు తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జిలతో ప్రత్యేకంగా మాట్లాడారు. అనంతరం హెలికాప్టర్లో హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు.