ఇవాళ విశాఖలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరనున్నారు. సీఎం వైఎస్ జగన్ గన్నవరం ఎయిర్ ఫోర్టు నుంచి ప్రత్యేక విమానంలో 11.20 గంటలకు విశాఖ ఎయిర్ ఫోర్ట్ కి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చినముషిడివాడలోని శ్రీశారదా పీఠానికి 11.40 గంటలకు వెళ్తారు. సంప్రదాయ వస్త్రాలు ధరించి పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామిజీ, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామిజీతో కలిసి పీఠంలోని దేవతామూర్తులకు సీఎం జగన్ ప్రత్యేక పూజలు చేస్తారు.
రాజశ్యామ యాగంలో పాల్గొంటారు. దాదాపు గంట పాటు పీఠంలో జరుగనున్న పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో సీఎం పాలు పంచుకుంటారు. అనంతరం 12.55 గంలకు విశాఖ ఎయిర్ ఫోర్ట్ కి చేరుకొని గన్నవరం బయలుదేరుతారు. సీఎం జగన్ విశాఖ శ్రీశారదా పీఠాన్ని సందర్శించనున్న నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఎయిర్ ఫోర్ట్ నుంచి పీఠం వరకు ట్రయల్ రన్ నిర్వహించారు. సీఎం ను చూసేందుకు ప్రజలు భారీ రానుండటంతో బారీకేడ్లు ఏర్పాట్లు ఏర్పాటు చేశారు. మరోవైపు సీఎం ను సాదరంగా స్వాగతించేందుకు ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.