ఏపీలో మరో 70 రోజుల్లోనే ఎన్నికలు జరగనున్నాయి అని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పార్టీలను ఉద్దేశించి మాట్లాడుతూ అబద్ధానికి, నిజానికి మధ్య ….మోసం, విశ్వసనీయతకు మధ్య ఈ యుద్ధం జరుగుతోంది అని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 56 నెలల్లో గ్రామాల్లో ఎన్నో మార్పులు తీసుకువచ్చాము. లంచాలు, వివక్షకు తావు లేకుండా ప్రతి ఒక్కరికి పథకాలు అందిస్తున్నాం అని ఆయన తెలిపారు. ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటు చేయడంతో పాటు నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేశాం అని అన్నారు.ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం అని సీఎం వైఎస్ జగన్ గుర్తు చేశారు.
మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని నెరవేర్చాం అని ,ఇప్పటి వరకు 99 శాతం హామీలు నెరవేర్చాం అని అన్నారు.175 స్థానాలకు 175 సీట్లు గెలుపే మన టార్గెట్ గా పనిచేయాలని సూచించారు.చంద్రబాబుతో సహా అందర్ని ఓడించాలి అని ,మనం చేసే మంచి పనులే మనల్ని గెలిపిస్తాయి అని ఆయన చెప్పారు.చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాడు అని సీఎం వైఎస్ జగన్ అన్నారు.