AP Politics: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. రేపు టెట్ నోటిఫికేషన్

AP Politics: Good news for AP unemployed.. Tet notification tomorrow
AP Politics: Good news for AP unemployed.. Tet notification tomorrow

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధం అవుతోంది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న డిమాండ్ పై ముందడుగు వేసింది. టెట్ పరీక్ష నిర్వహించేందుకు కసరత్తు పూర్తి చేసింది. ఈ మేరక టెట్ పరీక్ష నోటిఫికేసన్ ను గురువారం విడుదల చేయనుంది. అదేవిదంగా గురువారం ఈనెల 18 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరించనుంది. ఈనెల 27 నుంచి మార్చి 08 వరకు టెట్ పరీక్షలను అధికారులు నిర్వహించనున్నారు. మార్చి 14న ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారులు చేసిన కసరత్తు ముగియడంతో టెట్ నిర్వహణకు సర్వం సిద్ధం చేశారు.

గురువారం మధ్యాహ్నం వరకు టెట్ నోటిఫికేషన్ ను అధికారికంగా ప్రకటించనున్నారు. మరోవైపు 6,100 టీచర్ల పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈనెల 12 నుంచి లైన్ లోన్ లో దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుందని తెలిపారు.