Crime: నల్గొండలో ప్రేమికులే టార్గెట్.. కొత్తరకం దోపిడీ..!

Crime: Lovers are the target in Nalgonda.. A new type of robbery..!
Crime: Lovers are the target in Nalgonda.. A new type of robbery..!

ప్రేమ జంట కనిపిస్తే చాలు వీరి పంట పండినట్టే. లవర్స్ను బెదిరిస్తూ అందినకాడికి దోచుకుంటున్న ముఠా ఎట్టకేలకు నల్గొండ పోలీసులకు చిక్కింది. ప్రేమికులు ఏకాంతంగా ఉన్న సమయంలో వారిని ఈ ముఠా టార్గెట్ చేస్తుంది. రహస్యంగా వీడియోలు తీసి.. లీక్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతోంది. ఆరుగురు యువకులు బృందంగా ఏర్పడి పలువురిని బెదిరించి డబ్బు, నగలు, విలువైన వస్తువులు తీసుకున్నారు. జరిగిన విషయాన్ని బాధితులు బయటకు చెప్పుకోలేక మిన్న కుండిపోయారు. కొన్ని రోజులుగా ఈ ముఠా ఆగడాలు పెరిగిపోవడంతో పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో నిఘా పెట్టి ఆరుగురిని అరెస్టు చేశారు.

నల్గొండకు చెందిన కుంచం చందు, ప్రశాంత్, రాజు, చింతా నాగరాజు, అన్నె పూరి లక్ష్మణ్, శివరాత్రి ముకేష్ను కోర్టులో హాజరుపర్చనున్నట్టు తెలిపారు. నిందితుల నుంచి బంగారు ఉంగరాలు, సెల్ఫోన్లు, ఖరీదైన వాచీలు, రెండు టీవీలు, డ్రిల్లింగ్ యంత్రం, ఇన్వర్టర్ స్వాధీనం చేసుకున్నారు.