AP Politics: డయేరియా బాధితులకు శుభవార్త ..!

AP Politics: Good news for diarrhea victims ..!
AP Politics: Good news for diarrhea victims ..!

ఏపీ సీఎం జగన్‌ డయేరియా బాధితులకు గుడ్‌ న్యూస్‌ చెప్పారు. డయేరియా బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు జగన్‌ సర్కార్‌ ముందుకు వచ్చింది. ఈ మేరకు మంత్రి రజిని మాట్లాడుతూ… ఇప్పటికే వైద్యులు డయేరియా బాధితులను డిశ్చార్జ్ చేశారు… ఏమైనా సమస్యలు ఉంటే 83413961045 పోన్ చెయ్యొచ్చు అని మంత్రి రజని ప్రత్యేక నంబర్‌ ఏర్పాటు చేశారు.

ఇక అటు గుంటూరు న‌గ‌రంలో ప‌లువురికి వాంతులు, విరేచినాలు వంటి అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు సంబంధించి అధికారులంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని గారు ఆదేశాలు జారీచేశారు. గుంటూరు క‌లెక్ట‌రేట్‌లో ఆదివారం అధికారుల‌తో మంత్రి విడ‌ద‌ల రజిని గారు స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు గ‌ల కార‌ణాల‌ను అన్వేషిస్తున్నామ‌న్నారు. మంచినీటి శాంపిళ్ల‌ను సేక‌రించి ప‌రీక్ష‌ల‌కు పంపామ‌ని చెప్పారు. ప‌రిస్థితి అదుపులోనేఉంద‌ని తెలిపారు. అయినాస‌రే అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిందేన‌ని అధికారుల‌కు స్ప‌ష్టం చేశారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు. మేయ‌ర్ కావ‌టి శివ‌నాగ‌మ‌నోహ‌ర్‌నాయుడు గారు, క‌మిష‌న‌ర్ కీర్తి చేకూరి గారు, డీఎంహెచ్‌వో, క‌లెక్ట‌ర్ వేణుగోపాల్‌రెడ్డి గారు,, ఆర్డీ, జీజీహెచ్ సూప‌రింటెండెంట్ త‌దిత‌రులు పాల్గొన్నారు.