ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్… నవరత్నాలు-పేదలందరికీ ఇల్లు కార్యక్రమం కింద 31.19 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం ఈనెల 27 నుంచి వాటికి రిజిస్ట్రేషన్లు చేయనుంది. గ్రామ/వార్డు సచివాలయాల్లో ఈ ప్రక్రియ ప్రారంభం కానుండగా….ప్రభుత్వం తరఫున వీఆర్వో రిజిస్ట్రేషన్ చేస్తారు.
వచ్చేనెల 9వ తేదీ కల్లా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి కానుంది. ఈ కార్యక్రమం సజావుగా సాగేలా కలెక్టరేట్లలో ప్రభుత్వం కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయనుంది. ఇది ఇలా ఉండగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సేవలు యధావిధిగా ప్రజలకు అందిస్తామని ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు డా.నరేంద్ర రెడ్డి తెలిపారు. అసోసియేషన్ పరిధిలోని 1,150 ఆసుపత్రుల్లో సేవలు నిరంతరాయంగా అందుతాయని పేర్కొన్నారు. సేవలు నిలిపివేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దన్నారు.