AP Politics: జగన్ ను చూస్తే.. జబర్దస్త్ బిల్డప్ బాబాయి గుర్తొస్తారు: నారా లోకేష్

AP Politics: If you see Jagan... you will remember Jabardast buildup Babai: Nara Lokesh
AP Politics: If you see Jagan... you will remember Jabardast buildup Babai: Nara Lokesh

జగన్ ను చూస్తే.. జబర్దస్త్ బిల్డప్ బాబాయి గుర్తొస్తారని నారా లోకేష్ ఎద్దేవా చేసారు. జగన్మోహన్ రెడ్డి మాటలను క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే మనకు జబర్దస్త్ బిల్డప్ బాబాయి గుర్తొస్తారు. ఆయన మాటలు మాత్రమే కోటలు దాటుతాయి, పనులు గడపదాటవు. సొంత ఇలాకా కడప జిల్లాలో మూడేళ్లలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తిచేస్తానని చెప్పి తొలిసారి శిలాఫలకం వేసి నేటికి నాలుగేళ్లయిందన్నారు. రూ.15వేలకోట్లతో స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టి పాతికవేలమందికి ఉద్యోగాలిస్తానంటూ ఆనాడు కోతలు కోశాడని ఫైర్ అయ్యారు.

ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ప్లాంట్ నిర్మాణం చేపట్టాల్సి ఉండగా, కనీసం తుప్పలు తొలగించేందుకు సైతం నిధులు కేటాయించకపోవడంతో తొలుత ఒప్పందం చేసుకున్న లిబర్టీ స్టీల్స్ పరారైపోయిందని ఫైర్ అయ్యారు. దీంతో జెఎస్ డబ్ల్యు అనే మరో కంపెనీని బతిమాలుకొని ఏడాది క్రితం మరోమారు శంకుస్థాపన చేశాడు. మరో మూడునెలల్లో పదవీకాలం పూర్తికావస్తున్నా కడప స్టీల్ ప్లాంట్ పనులు అంగుళం కూడా ముందుకు సాగలేదు. పులివెందులలో రోడ్ల నిర్మాణానికి బిల్లులు ఇవ్వకపోవడంతో కంకరపర్చి తారువేయకుండా కాంట్రాక్టర్ పరారయ్యాడు. ఇలాంటి దివాలాకోరు సీఎంని నమ్మి వేలకోట్లు పెట్టుబడి పెట్టడానికి ఎవరైనా ముందుకు వస్తారా?! అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.