AP Politics: పేదరికం లేని సమాజం చూడాలనేది నా జీవిత ఆశయం: చంద్రబాబు

AP Politics: Hearing on Chandrababu's bail cancellation petition adjourned..!
AP Politics: Hearing on Chandrababu's bail cancellation petition adjourned..!

ప్రపంచంలోనే తెలుగువారు నంబర్వన్గా ఉండాలనేది తన ఆకాంక్షని తెదేపా అధినేత చంద్రబాబు మరోమారు స్పష్టం చేశారు. బెంగళూరులో నిర్వహించిన తెదేపా ఫోరం సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘రైతు కుటుంబంలో పుట్టి.. ఐటీని ప్రోత్సహించా. అప్పట్లో ఐటీ ఏర్పాటు చేస్తానన్నప్పుడు.. విజన్-2020 అని చెప్పినప్పుడు నన్ను హేళన చేశారు. వైకాపా పాలనలో ఏపీలోని అన్ని వ్యవస్థలు భ్రష్టుపట్టాయి. రానున్న ఎన్నికలు ఎందుకు ముఖ్యమనేది ప్రజలకు వివరించాలి. పేదరికం లేని సమాజం చూడాలనేది నా జీవిత ఆశయం. పది మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి విద్యార్థులు ఎదగాలి. నన్ను మొదటిసారి గెలిపించింది విద్యార్థులే’’ అని చంద్రబాబు చెప్పారు.