ఓటు హక్కు కోసం మంత్రి విడదల రజిని తప్పుడు చిరునామా ఇచ్చారని టీడీపీ నేతలు అన్నారు. గుంటూరులో ఖాళీ స్థలం చిరునామాతో మంత్రి దరఖాస్తు చేసుకున్నారని ఆరోపించారు. మంత్రి ఇచ్చిన చిరునామాలో అపార్ట్మెంట్ ఉన్నట్లు పేర్కొన్నారు. దీనిపై టీడీపీ నేతలు అభ్యంతరం తెలుపుతూ.. రజినికి గుంటూరులో ఓటు హక్కు ఇవ్వొద్దని అధికారులకు వినతిపత్రం అందజేశారు.
మం త్రి పదవిలో ఉండి తప్పుడు పత్రాలతో దరఖాస్తు చేశారని టీడీపీ నేతలు మండిపడ్డారు. ఇప్పటికే చిలకలూరిపేటలోని పురుషోత్తమపట్నంలో ఆమె ఓటు ఉందని చెప్పారు. విడదల రజిని ప్రస్తుతం చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇటీవల ఆమెను గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సమన్వయకర్తగా వైసీపీ నియమించింది. ఈ నేపథ్యంలోనే రజిని గుంటూరులో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.