నేడు ఉమ్మడి విశాఖ జిల్లాలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటించనున్నారు. ఈ తరుణంలోనే ఇవాళ ఉదయం విశాఖ జిల్లా ముఖ్య నాయకత్వంతో సమావేశం కానున్నారు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఇక షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో ఏపీ టెక్నాలజికల్ సర్వీసెస్ మాజీ ఛైర్మన్ కొయ్య ప్రసాద్ రెడ్డి చేరనున్నారు.
మధ్యాహ్నం అనకాపల్లిలో కేడర్ మీటింగ్ నిర్వహిస్తారు వైఎస్ షర్మిల. అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల ముఖ్య నాయకులతో సమావేశం అవుతారు. ఇవాళ సాయంత్రం వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీకి సంఘీభావం ప్రకటించనున్నారు షర్మిల.
ఇక అటు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల వైసిపి ముఖ్య నేత వైవి సుబ్బారెడ్డి సవాళ్లు ను షర్మిల స్వీకరించారు. ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడుతూ…గత నాలుగేళ్లలో వైసిపి ప్రభుత్వం పాలనలో చేసిన అభివృద్ధి చూడడానికి తాను సిద్ధమని, ‘డేట్ ,టైం మీరు చెప్పిన మమ్మల్ని చెప్పమన్నా సరే అభివృద్ధి పనులు ఎక్కడ చేశారో చూపించండి, నేను మీడియాను తీసుకొస్తా అని సవాల్ విసిరారు. గత నాలుగేళ్ల పరిపాలనలో రాజధాని లేకుండా పాలించిన ప్రభుత్వం వైసీపీదే అని షర్మిల మాట్లాడారు. ఒక్క మెట్రో కూడా లేదంటే పరిస్థితి ఎలా ఉందో తెలిసిపోతుందని మాట్లాడారు.