అసెంబ్లీ ఎన్నికలపై పూర్తి స్థాయిలో సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే..ముద్రగడ చిన్న కోడలు సిరిని తుని బరిలో నిలిపే యోచనలో వైసీపీ పార్టీ నిర్ణయం తీసుకుందని సమాచారం అందుతోంది. ముద్రగడ చిన్న కొడుకు గిరిబాబు భార్యనే ఈ సిరి. సిరి సొంత ఊరు తుని నియోజకవర్గంలోని ఎస్ అన్నవరం అన్న సంగతి తెలిసిందే.
మంత్రి దాడిశెట్టి రాజాను కాకినాడ ఎంపీగా పోటీ చేయాలని ప్రపోజల్ పెట్టింది వైసీపీ పార్టీ. ఇక ఎంపీగా వెళ్లడానికి పెద్ద ఆసక్తి చూపని దాడిశెట్టి రాజా…ఫైనల్ గా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారట. తుని నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు దాడిశెట్టి రాజా. అయితే, కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇక ఎంపీ అభ్యర్థి కోసం వెతికే పనిలో వైసిపి పడింది.