AP Politics: పవన్ కళ్యాణ్ పర్యటన కోసం స్పెషల్ హెలికాఫ్టర్..?

AP Politics: Will Pawan Kalyan travel in a special helicopter?
AP Politics: Will Pawan Kalyan travel in a special helicopter?

వచ్చే ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని అన్ని పార్టీలు నేతలు విస్తృత పర్యటనలకు సిద్ధమవుతున్నారు. ఈసారి ఎన్నికలుని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు సాగుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేక హెలికాఫ్టర్ వాడబోతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో అన్ని జిల్లాలలో విస్తృత పర్యటనలకి జనసేనని ప్లాన్ చేస్తున్నారట ప్రతి జిల్లా ని కనీసం మూడుసార్లు టచ్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ ప్రణాళికలు సిద్ధం చేశారని జనసేన పార్టీ శ్రేణులు అంటున్నారు.

మొదటి దశ పర్యటనలో జిల్లా ముఖ్య నేతలతో సమీక్ష సమావేశాలు ఉంటాయట పార్టీ బలం పోటీ చేస్తే సాధించే ఓట్లు వంటి అంశాల మీద దృష్టి పెట్టబోతున్నారు తర్వాత ప్రచారంతో జిల్లాలను చుట్టేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే అటు బిజెపి ఇటు తెలుగుదేశం పార్టీతో పొత్తు కలిగి ఉంది జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో టిడిపి జనసేన బిజెపి కలిసి ముందుకు సాగేలా ప్రయత్నాలు సాగుతున్నాయి.