AP Politics: YCP రెండో లిస్ట్ రెడీ ఇదే.. ఎమ్మెల్యే బరిలో ఎంపీ..!

AP Politics: YCP's second list is ready.. MLA Barilo MP..!
AP Politics: YCP's second list is ready.. MLA Barilo MP..!

వైసీపీ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల రెండో లిస్ట్ రెడీ అవుతోంది. మొదటి విడతలో 11 సెగ్మెంట్లలో మార్పులు జరిగాయని సమాచారం. ముగ్గురు మంత్రులకు స్థానచలనం చేసిందట వైసీపీ పార్టీ హై కమాండ్. ఇక దాదాపుగా కొలిక్కి వచ్చింది వైసీపీ పార్టీ సెకెండ్ లిస్ట్.ఇవాళా లేదా రేపటిలో ప్రకటించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

క్లారిటీ వచ్చిన నియోజకవర్గాలను ఎప్పటికప్పుడు ప్రకటించేయాలనే ఆలోచనలో అధిష్టానం ఉందని సమాచారం. పక్క పార్టీ వాళ్ళతో టచ్ లోకి వెళుతున్న టికెట్ రాదని పలువురు ఆశావహులు నిర్ధారణ అయ్యారు. పెద్దాపురం నుంచి ముద్రగడను బరిలో పెట్టే ప్రయత్నాల్లో పార్టీ ఉన్నట్లు సమాచారం అందుతోంది. పార్టీలో చేర్చుకుని పెద్దాపురం నుంచి బరిలో ముద్రగడ పద్మనాభం దింపాలని జగన్‌ ఆలోచన చేస్తున్నారట.

పి. గన్నవరం – మోకా సత్తిబాబు వైఫ్ లక్ష్మీ
పాయకరావుపేట – పండుల రవీంద్ర బాబు
అమలాపురం – విశ్వరూప్ కొడుకు డా. శ్రీకాంత్
రాజోలు లో – రాపాక వర ప్రసాద్ లేదా..మట్టా శైలజ
రామచంద్రపురం – పిల్లి బోస్ కొడుకు పిల్లి ప్రకాశ్
రాజమండ్రి రూరల్ – చెల్లుబోయిన
రాజమండ్రి అర్బన్ – మార్గాని భరత్
జగ్గంపేట – తోట నరసింహం
ప్రత్తిపాడు – పర్వత జానకి దేవి
పిఠాపురం- వంగా గీత